Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrashekhar Guruji: వాస్తు నిపుణులు చంద్రశేఖర్ హత్యకేసులో పురోగతి.. ఇద్దరు అరెస్ట్.. ఒకరు మాజీ ఉద్యోగిగా గుర్తింపు

ఇద్దరు వ్యక్తులు చంద్రశేఖర్ గురూజీ నుంచి వాస్తు సలహాలు తీసుకోవాలనే నేపథ్యంతో కలిసేందుకు వచ్చారు. ఆయనతో భేటీ అయిన కొద్ది క్షణాల్లోనే కత్తులతో దాడి చేసి 39 సార్లు పొడిచారు.

Chandrashekhar Guruji: వాస్తు నిపుణులు చంద్రశేఖర్ హత్యకేసులో పురోగతి.. ఇద్దరు అరెస్ట్.. ఒకరు మాజీ ఉద్యోగిగా గుర్తింపు
Chandrashekhar Guruji
Follow us
Surya Kala

|

Updated on: Jul 06, 2022 | 11:17 AM

Chandrashekhar Guruji: కర్ణాటక (Karnataka )హుబ్లీలో  దారుణ ఘటన చోటు చేసుకుంది. సరళ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్‌ గురూజీ హత్య తీవ్ర సంచలనం రేసింది. వాస్తు సూచనల కోసమంటూ వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఆయన్నీదారుణంగా కత్తులతో పొడిచి పరారయ్యారు. చంద్రశేఖర్ శరీరంపై 39 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  దాడిని హోటల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. వారిని బెదిరిస్తూ అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హత్య జరుగుతున్న సంశయంలో అక్కడ ఉన్నవారు.. భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

చంద్రశేఖర్‌ గురూజీ సరళ వాస్తు పేరుతో టీవీ షోను హోస్ట్ చేయడం ద్వారా కర్ణాటకలోనే కాదు.. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అనేక టీవీ ఛానళ్లలో ఆయన వాస్తుకు సంబంధించిన సలహాలు, సూచనలిచ్చేవారు. 2వేలకుపైగా సెమినార్లలో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 16కు పైగా అవార్డులు లభించాయి. సివిల్‌ ఇంజినీరింగ్‌తో పాటు కాస్మిక్‌ ఆర్కిటెక్చర్‌లో చంద్రశేఖర గురూజీ డాక్టరేట్‌ పొందారు. దేశ విదేశాల్లోనూ అయనకు అభిమానులు ఉన్నారు. సరళా వాస్తు సలహాపై అనేక పుస్తకాలు కూడా రాశారు.

కర్ణాటకలోని హుబ్లీ నగర శివార్లలోని ఉణకల్‌ హోటల్‌లో చంద్రశేఖర్ బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు ఆయన నుంచి వాస్తు సలహాలు తీసుకోవాలనే నేపథ్యంతో కలిసేందుకు వచ్చారు. ఆయనతో భేటీ అయిన కొద్ది క్షణాల్లోనే కత్తులతో దాడి చేసి 39 సార్లు పొడిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్‌ మృతదేహాన్ని హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనాస్థలాన్ని పోలీస్‌ కమిషనర్‌ లాబూరామ్‌ సందర్శించారు. హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

హోటల్‌ రిసెప్షన్‌లో  ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని ఆధారంగా పోలీసులు పరిశోధన చేపట్టారు. బెల్గాంలో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. దాడికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బినామీ ఆస్తుల వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. రెండు రోజుల క్రితం కూడా హంతకులు స్వామీజీని కలిసినట్టు తెలిసింది. రెక్కీ నిర్వహించిన తరవాత ఈ హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

హుబ్లీలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన చాలా దారుణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశామని తెలిపారు. నిందితుల్లో ఒకరు చంద్రశేఖర్‌ దగ్గర మాజీ ఉద్యోగని.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని హోంమత్రి చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..