Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter: సోషల్ మీడియా జవాబుదారీగా ఉండాల్సిందే.. చర్చనీయాంశంగా మారిన కేంద్ర మంత్రి కామెంట్స్

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ (Twitter) కు కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రభావం అధికంగా ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి.. కాబట్టి సోషల్ మీడియా జవాబుదారీగా...

Twitter: సోషల్ మీడియా జవాబుదారీగా ఉండాల్సిందే.. చర్చనీయాంశంగా మారిన కేంద్ర మంత్రి కామెంట్స్
Twitter
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 2:44 PM

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ (Twitter) కు కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రభావం అధికంగా ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి.. కాబట్టి సోషల్ మీడియా జవాబుదారీగా ఉండాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వీటి ప్రభావం అధికంగా ఉందని.. జవాబుదారీగా ఉండాలనే అంశంపై విధివిధానాల గురించి తీవ్ర కసరత్తు జరుగుతోందని వివరించారు. కాగా.. భారత ప్రభుత్వ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ట్విటర్‌ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ సమయంలో కేంద్రమంత్రి (Union Minister Ashwini Vaishnaw) ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కంపెనీ ఏ రంగానిదైనా అది బారత ప్రభుత్వ ఆదేశాలకు లోబడే పని చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. పార్లమెంట్‌ చేసిన చట్టాలకు అనుగుణంగా వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. కాగా.. సోషల్ మీడియాల్లో కంటెంట్‌ నియంత్రణ కోసం కేంద్రం కొత్తగా ఐటీ రూల్స్ ను తీసుకొచ్చింది. ఈ నిబంధనలు గతేడాది మే నుంచి అమల్లోకి వచ్చాయి. వీటిని ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు పాటిస్తున్నప్పటికీ ట్విట్టర్‌ మాత్రం పాటించడం లేదు. తద్వారా భారత ప్రభుత్వానికి, ట్విటర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం జులై 4 లోగా అన్ని ఆదేశాలను పాటించాలని సూచించింది. లేకపోతే మధ్యంతర హోదా కోల్పోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్ ను సవాల్ చేస్తూ ట్విట్టర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. ఫిబ్రవరి 2021 నుంచి ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య గొడవ ముదిరింది. ఫిబ్రవరిలో ప్రభుత్వం 1,178 పేర్ల జాబితాను ట్విట్టర్‌కు అందచేసింది. ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ శాంతిభద్రతలకు సమస్యలను కలిగిస్తున్నాయని, అందువల్ల వాటిని వెంటనే ఆపాలని ప్రభుత్వం కోరింది. ఆర్డర్ పాటించకపోతే, ఐటీ యాక్ట్ 69 ఏ కింద చర్యలు తీసుకుంటామని చెప్పింది. ప్రభుత్వ ఉత్తర్వు ట్విట్టర్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు.

మీడియా గ్రూపులు, జర్నలిస్టులు, కార్యకర్తలు, నాయకుల ఖాతాలపై తాము చర్యలు తీసుకోబోవడం లేదని ట్విట్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్విట్టర్ గానీ, ప్రభుత్వం గానీ రెండూ ఎక్కడా తగ్గడం లేదు. భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వహించుకునే ఒక సంస్థ భారత ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది? మరోవైపు ఫేస్ బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించాయి. కానీ ట్విట్టర్ మాత్రం ఆ నిబంధనలు పాటించకపోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి