సండే ఫండే ప్లాన్ చేస్తే.. విజయవాడలో ఈ ప్లేసులు బెస్ట్..
Prudvi Battula
Images: Pinterest
06 December 2025
విజయవాడలో మొదటిగా ఇంద్రకీలాద్రిపై కోరిన కోర్కెలు తీర్చే కనక దుర్గమ్మని దర్శించుకొని ఆ జగన్మాత దీవెనలు పొందొచ్చు.
కనక దుర్గమ్మ గుడి
విజయవాడలో చూడదగిన ప్రదేశల్లో ఇంద్రకీలాద్రి కొండ కిందే కృష్ణానదిపై నిర్మించిన చారిత్రక ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్ ఒకటి.
ప్రకాశం బ్యారేజ్
ప్రకాశం బ్యారేజీకి ఎగువ పరివాహక ప్రాంతంలో నది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్స్ బెజవాడ నగరంలో ప్రత్యేక ఆకర్షణ.
భవానీ ఐలాండ్స్
విజయవాడకు సమీపంలోని ప్రాచీన ఏకశిలా నిర్మాణశైలికి గొప్ప ఉదాహరణగా నిలిచినా ఉండవల్లి గుహలు తప్పకుండా చూడాల్సిందే.
ఉండవల్లి గుహలు
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కొండపల్లిలో 14వ శతాబ్దపు చారిత్రక కొండపల్లి కోట చాలా ప్రసిద్ధి. ఇక్కడ కొండపల్లి బొమ్మలు ఫేమస్.
కొండపల్లి
కృష్ణా నది బంగాళాఖాతం సంగమ ప్రాంతం హంసలదీవి బెజవాడ సమీపంలో అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ చాళక్యుల కాలం నాటి వేణుగోపాల స్వామి ఆలయం ఉంది.
హంసలదీవి
వీటితో పాటు సుబ్రమణ్య స్వామి, మంగళగిరి లక్ష్మీనరసింహా స్వామి, రామలింగేశ్వరస్వామి, ఇస్కాన్, హింకర్ తీర్త, పరిటాలా హనుమాన్, గుణదల మేరీ మాతా ఆలయాలను దర్శించుకోవచ్చు.
మంగళగిరి
తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విజయవాడకు రైలు, విమానం, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
రైలు, విమానం, బస్సు సౌకర్యాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
రాత్రుళ్లు నిద్ర లేదా.? ఏ రాశి వారు ఏం చెయ్యాలంటే.?
బెస్ట్ సన్ రైజ్ చూడాలంటే.. ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..
ఈ టిప్స్ పాటిస్తే.. పసుపు రంగు క్లియర్.. మిల మిల మెరిసే దంతాలు..