Spicejet: మరో స్పైస్‌జెట్ విమానానికి తప్పిన ప్రమాదం.. ముంబైలో అత్యవసర ల్యాండింగ్..
ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానాన్ని సాంకేతిక సమస్యలతో అత్యవసరంగా కరాచీలో ల్యాండ్‌చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్చేశారు.
Spicejet Flight landing in mumbai: దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానాలు ప్రమాదాలకు గురవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానాన్ని సాంకేతిక సమస్యలతో అత్యవసరంగా కరాచీలో ల్యాండ్‌చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్చేశారు. గుజరాత్ కాండ్ల నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న విమాన విండ్షీల్డ్దెబ్బతినడంతో మంబైలో ల్యాండ్ చేశారు.
గుజరాత్‌లోని కాండ్లా నుండి ముంబైకి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం మంగళవారం ముంబై విమానాశ్రయంలో 23,000 అడుగుల ఎత్తులో విండ్‌షీల్డ్ పగులగొట్టడంతో ప్రాధాన్యతాక్రమంలో ల్యాండింగ్ చేసినట్లు DGCA అధికారులు తెలిపారు. గత 17 రోజుల్లో స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం సంభవించడం ఇది కనీసం ఏడవది.
కాగా.. ఈ ఘటనపై విమానయాన సంస్థ స్పైస్జెట్స్పందించింది. విండ్‌షీల్డ్ దెబ్బతినడం వల్ల పైలట్లు అత్యవసరంగా ల్యాండ్ చేశారని.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని తెలిపింది. ఒకే రోజులో రెండు ఘటనలు జరిగాయని.. గత 17 రోజుల్లో ఇది ఏడో ప్రమాదమని డీజీసీఏ అధికారులు చెప్పారు. ఈ ఘటనలపై విచారణ చేపట్టినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది.
మంగళవారం తెల్లవారుజామున.. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్జెట్విమానాన్ని పాకిస్థాన్లోని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది. ఫ్యూయల్ ఇండికేటర్ సరిగా పనిచేయకపోవడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో స్పైస్జెట్విమానంలో 150 మంది ప్రయాణికులున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి