AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: రెబల్ ఎమ్మెల్యేలపై ప్రజలూ ఆగ్రహంతో ఉన్నారు.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఏక్ నాథ్ శిండే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు నిత్యకృత్యమయ్యాయి. ఈ క్రమంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్...

Maharashtra: రెబల్ ఎమ్మెల్యేలపై ప్రజలూ ఆగ్రహంతో ఉన్నారు.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Shiv Sena Mp Sanjay Raut (File Photo)
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 06, 2022 | 2:44 PM

Share

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఏక్ నాథ్ శిండే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు నిత్యకృత్యమయ్యాయి. ఈ క్రమంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారన్న ఆయన.. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన (Shivasena) 100కు పైగా స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. ధన బలంతో, కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడితో శివసేనను హైజాక్‌ చేయడం సాధ్యం కాదని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీకి కొత్త స్పీకర్‌గా ఎన్నికైన రాహుల్ నర్వేకర్‌ పై కూడా సంజయ్ మండి పడ్డారు. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. బలపరీక్షలో ఏక్‌నాథ్‌ శిండే (Eknath Shinde) విజయం సాధించిన తర్వాత.. ఉద్ధవ్‌ నేతృత్వంలోని 14 మంది ఎమ్మెల్యేలు విప్‌ ధిక్కరించారంటూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీటిపై స్పందిస్తూ.. ఇదంతా చట్టపరమైన ప్రక్రియ అని, ఆ 14 మంది ఎమ్మెల్యేలు బాలాసాహెబ్‌ శివ సైనికులు అని అనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మహారాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో ఏక్ నాథ్ షిండే తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం ఉదయం జరిగిన విశ్వాస పరీక్షలో 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో గెలిచారు. వివిధ రకాల కారణాలతో దేశంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. వీటి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రప్రభుత్వం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రాలూ వ్యాట్‌ తగ్గించాలని కోరింది. అయితే, వ్యాట్‌ తగ్గించేందుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఈ క్రమంలో బీజేపీ మద్దతుతో షిండే ప్రభుత్వం ఏర్పాటు కాగానే వ్యాట్‌ను తగ్గించనున్నట్టు ప్రకటించడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి