AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Fan : రోడ్డు ప్రమాదంలో గాయపడిన తారక్ వీరాభిమాని జనార్దన్ మృతి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులంటే తారక్ కు ప్రాణం.. ప్రతి ఆడియో ఫంక్షన్ లో అభిమానులకు జాగ్రత్త చెప్తూ ఉంటాడు తారక్..

NTR Fan : రోడ్డు ప్రమాదంలో గాయపడిన తారక్ వీరాభిమాని జనార్దన్ మృతి
Ntr
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2022 | 7:45 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR ) అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులంటే తారక్ కు ప్రాణం.. ప్రతి ఆడియో ఫంక్షన్ లో అభిమానులకు జాగ్రత్త చెప్తూ ఉంటాడు తారక్. అయితే కొద్దిరోజుల క్రితం తన అభిమాని చావు బ్రతుకుల మధ్య ఉన్న విషయం తెలుసుకొని అతడిని పరామర్శించారు తారక్. ఎన్టీఆర్ అభిమాని అయిన శ్రీకాళహస్తికి చెందిన జనార్ధన్ అనే వ్యక్తి ఇటీవల ఓ యాక్సిడెంట్‌లో గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. అతడిని ఫోన్ లో పరామర్శించాడు తారక్. నేనున్నా అంటూ దైర్యం చెప్పాడు. కానీ ఆ అభిమాని కన్నుమూశాడు. రోడ్డు ప్రమాదానికి గురైన జనార్దన్‌ తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. దాంతో తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పోస్ట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన జనార్ధన్ కోమాలోకి వెళ్ళాడు. తమ కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న తల్లిదండ్రులు ఎన్నివిధాలుగా ప్రయత్నించినా, జనార్ధన్ మాత్రం రెస్పాండ్ కావడం లేదు. దీంతో డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే జనార్ధన్‌కు ఎన్టీఆర్ అంటే ప్రాణం. తన చివరి కోరికగా తన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్ తో మాట్లాడాలని జనార్ధన్  తల్లి సోషల్ మీడియా వేదికగా కోరింది. ఈ విషయం తెలుసుకున్న తారక్ తన అభిమాని పరిస్థితి గురించి ఆరా తీసి అన్ని విషయాలను కనుకున్నాడు.  అంతేగాక జనార్ధన్ తల్లితో తమ కుటుంబానికి తాను అండగా ఉంటానని ధీమా ఇచ్చాడు. కోమాలో ఉన్న జనార్ధన్‌తో తారక్ ఫోన్ స్పీకర్ ద్వారా మాట్లాడి, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు కానీ తారక్ ప్రార్ధన ఫలించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..