India Corona: దేశంలో కరోనా కల్లోలం.. 19వేలకు చేరువగా కొత్త కేసులు.. ఆ రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ..

Covid19 Updates: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు రోజువారీ కేసులు భారీగా పెరిగాయి. వైరస్‌ విజృంభిస్తుండడంతో గత 24 గంటల్లో 18,930 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు కూడా 1.20లక్షల చేరువకు

India Corona: దేశంలో కరోనా కల్లోలం.. 19వేలకు చేరువగా కొత్త కేసులు.. ఆ రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ..
Coronavirus Cases
Follow us
Basha Shek

|

Updated on: Jul 07, 2022 | 10:57 AM

Covid19 Updates: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు రోజువారీ కేసులు భారీగా పెరిగాయి. వైరస్‌ విజృంభిస్తుండడంతో గత 24 గంటల్లో 18,930 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు కూడా 1.20లక్షల చేరువకు సమీపించాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్‌ (Corona Bulletin)ను విడుదల చేసింది. ఈ గణంకాల ప్రకారం బుధవారం 4.38 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..18,930 మందికి వైరస్ సోకినట్లు తేలింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 16వేలుగా ఉండడం గమనార్హం. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.35 కోట్ల మంది మహమ్మారి బారిన పడ్డారు. పాజిటివిటీ రేజు 4.32 శాతంగా నమోదైంది.

కొత్త కేసుల్లో ఒక్క కేరళలో నాలుగువేలకుపైగా కేసులొచ్చాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లోనూ వైరస్‌ విస్తరిస్తోంది. ఇక గడిచిన 24 గంటల్లో 14,650 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 4.29 కోట్లకు చేరుకుంది. రికవరీ రేటు 98.52 శాతంగా ఉంది. ప్రస్తుతం 1,19,457 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 0.27 శాతానికి చేరింది. కాగా నిన్న మొత్తం 35 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇక బుధవారం 11.4 లక్షల మంది కొవిడ్‌ టీకా తీసుకోగా.. మొత్తంగా 198 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ