జుట్టు పట్టుకుచ్చులా ఒత్తుగా పెరగాలా? మెంతులను ఇలా వాడితేసరి

23 December 2024

TV9 Telugu

TV9 Telugu

చలికాలంలో జుట్టు పొడిబారిపోవడం, నిర్జీవంగా తయారవడం సహజమే. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మెంతులతో తయారుచేసిన ప్యాక్ ఉపయోగించాల్సిందే

TV9 Telugu

ఈ కాలంలో కుదుళ్లలో నూనెలు ఎక్కువగా విడుదల కావడం వల్ల చుండ్రు సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. మరి, కుదుళ్లలో నూనెల్ని నియంత్రించాలంటే మెంతులతో తయారుచేసిన ఈ ప్యాక్‌లు ట్రై చేయండి

TV9 Telugu

మెంతిగింజల్లో ఐరన్, ప్రొటీన్, విటమిన్ ఎ, సి, ఫోలిక్ యాసిడ్‌తో పాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు మేలు చేస్తాయి

TV9 Telugu

పొడవాటి, ఒత్తుగా ఉండే జుట్టు కోసం మెంతులతో చేసిన ప్యాక్స్‌ వారానికి 1 నుండి 2 సార్లు జుట్టుకు అప్లై చేయవచ్చు. గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది

TV9 Telugu

మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి అందులో పెరుగు వేసి కలపాలి. దీన్ని జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి

TV9 Telugu

కొబ్బరి నూనెను వేడి చేసి, అందులో మెంతులు వేసి 5 నుండి 10 నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత తలకు మసాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు చక్కగా పెరుగుతుంది

TV9 Telugu

మెంతి గింజలను నీటిలో వేసి మరిగించాలి. నీరు సగానికి తగ్గినప్పుడు గ్యాస్‌ ఆఫ్‌ చేసి, అందులో ఉల్లిపాయ రసం కలిపి జుట్టుకు పట్టించినా ప్రయోజనం ఉంటుంది. అయితే గంట తర్వాత తల స్నానం చేయాలి సుమీ

TV9 Telugu

అలోవెరా జెల్‌లో మెంతి పొడిని మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇది స్కాల్ప్‌లో తేమను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, వాటిని గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేయాలి. ఇప్పుడు అందులో నెయ్యి మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసినా మంచిదే