Vikram OTT: కమల్‌ హాసన్ విక్రమ్‌ ఓటీటీలోకి వచ్చేసిందోచ్‌.. ఎక్కడ చూడొచ్చంటే..

Vikram: గతనెల 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా చాలా విరామం తర్వాత సిల్వర్‌స్ర్కీన్‌పై ఎంట్రీ ఇచ్చిన కమల్‌ను చూసేందుకు..

Vikram OTT: కమల్‌ హాసన్ విక్రమ్‌ ఓటీటీలోకి వచ్చేసిందోచ్‌.. ఎక్కడ చూడొచ్చంటే..
Vikram
Follow us
Basha Shek

|

Updated on: Jul 08, 2022 | 11:18 AM

Vikram: లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నాలుగేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం విక్రమ్‌. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) కీలక పాత్రల్లో నటించారు. మరో కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ సూర్య (Suriya) రోలెక్స్‌ పాత్రలో రప్ఫాడించాడు. గతనెల 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా చాలా విరామం తర్వాత సిల్వర్‌స్ర్కీన్‌పై ఎంట్రీ ఇచ్చిన కమల్‌ను చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎగబడ్డారు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. తమిళ్‌తో పాటు అటు తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోన్న ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది.

నేటి నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విక్రమ్‌ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి థియేటర్లలో కమల్ హంగామాను చూడలేని వారు ఎంచెక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చెయ్యండి. కాగా ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ బ్యానర్‌పై ఆర్‌ మహేందర్‌తో కలిసి కమల్‌ నిర్మించారు. ఇది ఆ బ్యానర్‌లో వచ్చిన 50వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ సమకూర్చిన స్వరాలు, బీజీఏం ఓ రేంజ్‌లో పేలాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది