Major OTT: పాక్, బంగ్లాలోనూ మేజర్ హవా.. నెట్‌ఫ్లిక్స్ టాప్10 ట్రెండింగ్ సినిమాల లిస్టులో అగ్రస్థానం..
Major Movie: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'మేజర్'. యంగ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) సందీప్ పాత్రలో నటించాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ ..
Major Movie: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మేజర్’. యంగ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) సందీప్ పాత్రలో నటించాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, రేవతి కీలక పాత్రలు పోషించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, మహేష్‌బాబు (Mahesh Babu) ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూన్ 3న తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కించిన చిత్రం బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్లను సాధించింది. సిల్వర్‌స్ర్కీన్‌పై మెస్మరైజ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది. జులై 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రసారమవుతోంది.
#India #Pakistan #Bangladesh #SriLanka NUMBER 1 #MAJOR ??❤️ pic.twitter.com/R1G6tIWPTG
ఇవి కూడా చదవండి— Adivi Sesh (@AdiviSesh) July 8, 2022
పాక్ లోనూ..
కాగా సిల్వర్ స్ర్కీన్‌పై సత్తా చాటిన మేజర్ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ టాప్-10 ట్రెండింగ్ సినిమాల లిస్టులో మేజర్ సినిమాకే అగ్రతాంబూలం దక్కింది. ఈ జాబితాలో మేజర్ హిందీ వెర్షన్ మొదటి స్థానంలో ఉండగా, తెలుగు వెర్షన్ రెండో స్థానంలో ఉందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా తెలిపింది. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లోనూ మేజర్‌కు సినిమాకు అపూర్వ స్పందన వస్తోంది. ఈ దేశాల్లోని నెట్‌ఫ్లిక్స్ టాప్-10 ట్రెండింగ్ మూవీస్ లిస్టులో మేజర్ మొదటి స్థానంలో ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇండియా లవ్స్ మేజర్ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో షేర్ చేశాడు హీరో శేష్.
#MajorOnNetflix ??❤️ Let’s do this https://t.co/2dtTHXgwKy
— Adivi Sesh (@AdiviSesh) July 7, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..