AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eyebrow Transplant: తల వెంట్రుకలతో కనుబొమ్మలు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న యువతి.. లక్షలు కుమ్మరించి మరీ..

ప్రజలు తలపై జుట్టు ఒత్తుగా పెరగడం కోసం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నవారిని చూసి ఉంటారు. కానీ ఒక మహిళ కనుబొమ్మలను ఒత్తుగా చేసుకోవడం కోసం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న యువతి గురించి ఎప్పుడైనా విన్నారా.. ఈ విషయం తెలుసుకున్న జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.

Eyebrow Transplant: తల వెంట్రుకలతో కనుబొమ్మలు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న యువతి.. లక్షలు కుమ్మరించి మరీ..
Woman Eyebrow Transplant
Surya Kala
|

Updated on: Jul 09, 2022 | 1:56 PM

Share

Eyebrow Transplant: అందరికంటే తామే అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ అందానికి అందాన్ని మరింత పెంచేలా  రకరకాల చర్యలు తీసుకుంటూనే ఉంటారు. కొందరు బ్యూటీ ప్రొడక్ట్ వాడుతుంటారు.. మరికొందరు బ్యూటీ ట్రీట్ మెంట్ తీసుకుంటారు. ఇంకొందరు.. మరొక అడుగు ముందుకేసి.. తమ శరీరంలోని అవయవాలకు మెరుగులు దిద్దుకునేలా కొన్ని వింత పద్ధతులను కూడా అవలంబిస్తారు. అలాంటి ఒక యువతి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఓ యువతికి తన కనుబొమ్మలను అస్సలు నచ్చలేదు. దీంతో ఎవరూ ఊహించని విధంగా కనుబొమ్మలకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది. ఇప్పటి వరకూ చాలామంది తమకు జుట్టు ఒత్తుగా లేదని.. బట్టతల అంటూ తలపై వెంట్రుకల కోసం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవడం గురించి విని ఉంటారు. చూసి ఉంటారు. అయితే ఇప్పటి వరకూ  కనుబొమ్మలపై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటారన్న విషయం మీరు ఎప్పుడూ విని ఉండరు. ఈ విషయం తెలుసుకున్న జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.

ఇంగ్లాండ్‌లోని కోట్స్‌వోల్డ్స్‌కు చెందిన ఆ యువతి పేరు ఇసాబెల్లె కుత్సీ . తన కనుబొమ్మలను మందంగా చేసుకోవడానికి తన తల వెంట్రుకలను కనుబొమ్మలకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫలితంగా జుట్టు పెరిగితే.. ఎలా హెయిర్ కటింగ్ చేసుకోవాల్సి వస్తుందో.. అదే విధంగా ఇసాబెల్లె కుత్సీ ఎప్పుడూ తన కనుబొమ్మలను కత్తిరించుకోవాల్సి వచ్చింది. సాధారణంగా కనుబొమ్మల వెంట్రుకలు అంతగా పెరగకపోయినా తల వెంట్రుకలు మాత్రం వేగంగా పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా శరీరంలో ఎక్కడైనా తల వెంట్రుకలను మార్పిడి చేసుకుంటే.. అక్కడ ఖచ్చితంగా హెయిర్ కట్ చేయించుకోవాల్సిందే.

అయితే తనకు ఇలా కనుబొమ్మలపై హెయిర్ పెరగడం ఏమాత్రం ఇబ్బంది కాదని.. కనుబొమ్మలు వికారంగా కనిపించకుండా అందంగా కనిపించేలా ట్రిమ్మింగ్ చేయించుకుంటున్నానని ఇసాబెల్లె కుత్సీ చెప్పింది. అంతేకాదు.. దీని కోసం షెడ్యూల్‌ను తయారు చేసుకుని..  క్రమం తప్పకుండా కనుబొమ్మలను కత్తిరించుకుంటానని చెబుతుంది.

ఇవి కూడా చదవండి

మిర్రర్ యొక్క నివేదిక ప్రకారం.. ఇసాబెల్లె కుత్సీ చిన్న వయస్సులో అనుకోకుండా తన కనుబొమ్మల వెంట్రుకలను తీసివేసింది. ఆమె కనుబొమ్మలు తక్కువ వెంటుకలతో పల్చగా ఉన్నాయి. దీంతో తన కనుబొమ్మలు అందంగా కనిపించడం కోసం వాటిని అమర్చడానికి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు సమయం తీసుకునేది. ఇలా రోజూ చేయాల్సి రావడంతో మనస్తాపానికి గురైంది. దీనికి పరిష్కారంగా కనుబొమ్మల మార్పిడి చేసుకోవాలని ఆలోచించింది. అందుకోసం పోలెండ్ వెళ్లి సర్జరీ చేయించుకుంది. అందుకు సుమారు 1లక్ష 41 వేల రూపాయలు ఖర్చు చేసి మరీ   కనుబొమ్మలు దట్టంగా తయారు చేసుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..