Viral Video: కప్పను మింగేందుకు ట్రై చేసిన పాము.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన చిరుత.. షాకింగ్ వీడియో..
Viral Video: వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియో చూడటానికి భయానకంగా
Viral Video: వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియో చూడటానికి భయానకంగా అనిపిస్తే.. మరికొన్ని చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. ఇక జంతువుల వేట అయితే అత్యంత భీకరంగా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు పెద్ద జంతువులు వేరే జంతువులను వేటాడుతుండగా.. సహ జీవులు సహాయంగా వచ్చి, వాటిని కాపాడుతాయి. కానీ, వేరే జంతువులు కాపాడటం చాలా అరుదు. తాజాగా ఇలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవును, ఓ జీవి తనకంటే చిన్న జీవిని తిని ఆకలి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. పొట్టొ్డిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోశమ్మ కొట్టిందన్న చందంగా.. చిన్న జీవిని తినాలని చేసిన ప్రయత్నాన్ని పెద్ద జీవి విఫలం చేసింది. ఆ పెద్ద జీవికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆ వైరల్ వీడియోలో ఓ పాము కప్పను తినేందుకు ప్రయత్నించింది. అది గమనించిన చిరుత.. ఆ కప్పను కాపాడింది. చిరుత తన పంజాతో పాముకు ఒక్కటిచ్చింది. దెబ్బకు ఆ పాము గిలగిల గింజుకుంది. చిరుత దెబ్బకు పాము ఆ కప్పను విడిచిపెట్టగా.. కప్ప బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పారిపోయింది. అయితే, దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. చిరుత సాయానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.