Viral Letter: కన్నింగ్ ప్రియురాలికి ఊహించని రేంజ్‌లో బ్రేకప్ చెప్పిన ప్రియుడు.. ఆ లెటర్ మూమూలుగా లేదండోయ్..!
Viral Letter: ప్రేమ చాలా అందమైన అనుభూతి. అదే సమయంలో ప్రేమ బంధం కూడా చాలా సున్నితమైనది. అందువల్ల ప్రేమ బంధాన్ని..
Viral Letter: ప్రేమ చాలా అందమైన అనుభూతి. అదే సమయంలో ప్రేమ బంధం కూడా చాలా సున్నితమైనది. అందువల్ల ప్రేమ బంధాన్ని బలంగా ఉంచడానికి, కలకాలం కొనసాగించడానికి.. భాగస్వాములిద్దరూ నిజాయితీగా ఉండటం ఉత్తమం. నిజాలు దాయకుండా, ఒకరినొకరు మోసం చేసుకోకుండా ఉండాలి. లేదంటే.. ఏదో ఒక సందర్భంలో మనస్పర్థం చెలరేగి.. అదికాస్తా విడిపోయేందుకు దారి తీస్తుంది. అయితే, ప్రస్తుత కాలంలో బాంధవ్యాలకు అర్థమే లేకుండా పోతోంది. ఎప్పుడు ఎవరితో రిలేషన్‌లో ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కలవడం క్షణాల్లోనే.. విడిపోవడం క్షణాల్లోనే జరిగిపోతుంది. ప్రేమ అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటామో.. అంత చులకన అయిపోయింది. తాజాగా, ఓ బ్రేకప్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. అదే సమయంలో నవ్వుకుంటున్నారు.
సాధారణంగానే ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయిలు ఒకరికొకరు లెటర్స్ రాసుకోవడం తెలిసిందే. అయితే, ఈ లెటర్ మాత్రం ప్రేయసికి రాసిన బ్రేకప్ లెటర్. ఆ లెటర్ చూసి అంతా ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. స్కూల్లో సెలవు కోసం రాసినట్లుగా ఆ లెటర్ రాశాడు ప్రియుడు. అప్పటి వరకు ప్రియుడిగా ఉన్న అతను.. బ్రేకప్ లెటర్ తో సోదర బంధాన్ని కలిపేశాడు. ఇక్కడ అదే ట్విస్ట్.
వివరాల్లోకెళితే.. సుప్రియ అనే అమ్మాయి పేరు మీద ఈ బ్రేకప్ లెటర్ రాసి ఉంది. లెటర్ సబ్జెక్ట్‌లో అబ్బాయి తనకు బ్రేకప్ కావాలని రాశాడు. విడిపోవడానికి గల కారణాన్ని కూడా స్పష్టంగా వివరించాడు. 21వ శతాబ్దంలో తనకు అలాంటి తెలివైన అమ్మాయి అక్కర్లేదని ప్రేమికుడు రాశాడు. కన్నింగ్ అమ్మాయి అంటూ, తన రిలేషన్‌షిప్‌కు స్వస్తి పలుకుతున్నట్లు స్పష్టం చేశాడు. ఆ తర్వాత ‘నేనేమైనా తప్పు చేసి ఉంటే మీ అన్నయ్య అనుకుని క్షమించండి’ అని రాశాడు. లేఖ మొదట్లో తన ప్రియురాలిని మాజీ ప్రియురాలి అని సంబోధిస్తూ, చివర్లో మాత్రం తనను తాను ‘అన్నయ్య’గా అభివర్ణించుకున్నాడు. ఈ బ్రేకప్ లెటర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది
View this post on Instagram