AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Tips: పెట్రోల్, డీజిల్ పాడైపోతుందా..? ఎన్ని రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు..? చాలామందికి తెలియని విషయమిదే..

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి చుట్టూ అనిశ్చితి నెలకొన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ముడి చమురు సరఫరాలో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల్లో 20 నుంచి 25 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది.

Petrol Tips: పెట్రోల్, డీజిల్ పాడైపోతుందా..? ఎన్ని రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు..? చాలామందికి తెలియని విషయమిదే..
Petrol
Venkatrao Lella
|

Updated on: Mar 18, 2026 | 11:55 AM

Share

కీలకమైన హర్ముజ్ సముద్ర మార్గంలో సరుకు రవాణాకు ఆటంకం కలగడంతో.. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై దీని ప్రభావం పడుతుంది. ఇక భారత్‌పై కూడా దీని ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే దేశంలో గ్యాస్ ధరలు పెరగ్గా.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అప్రమత్తమై ముందుగానే పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకుంటున్నారు. అయితే వీటిని నిల్వ చేసుకోవడం చట్టబద్దమేనా..? ఎంతవరకు నిల్వ చేసుకోవచ్చు..? అనే విషయాలు తెలుసుకుందాం.

ఫ్లాష్ పాయింట్ గురించి తెలుసా..?

పెట్రోలియం ఉత్పత్తులు మంటతో మండటానికి సరపడ ఆవిరిని విడుదల చేసే కనిష్ట ఉష్ణోగ్రతను ఫ్లాష్ పాయింట్ అని పిలుస్తారు. దీని ఆధారంగా పెట్రోలియం ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభించారు. ఫ్లాష్ పాయింట్ 23 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే క్లాస్ ఎ పెట్రోలియం కేటగిరీగా పరిగణిస్తారు. ఇక 23 డిగ్రీల కంటే ఎక్కువ లేదా 65 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే క్లాస్ బిగా పిలుస్తారు. ఇక 65 డిగ్రీల కంటే ఎక్కువ లేదా 93 డిగ్రీల కంటే తక్కువ ఉంటే క్లాస్ సీగా పరిగణిస్తారు.

పెట్రోల్ ఎంతవరకు నిల్వ చేసుకోవచ్చు..?

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం.. క్లాస్ ఏ రకానికి చెందిన పెట్రోలియంను అమ్మకం కోసం కాకపోతే 30 లీటర్ల వరకు నిల్వ చేసుకోవడానికి లైసెన్స్ అవసరం లేదు. ఇంతకుమించి నిల్వ చేసుకోవడం చట్టబద్దంగా నిషేధం అమల్లో ఉంది. వ్యాపార అవసరాల కోసం కాని పక్షంలో అంతకంటే ఎక్కువ నిల్వ చేసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు.

పెట్రోల్, డీజిల్ పాడవుతాయా..?

పెట్రోల్, డీజిల్‌ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పాడైపోతాయి. గాలి తగలకుండా ఒక పాత్రలో పెట్రోల్‌ను నిల్వ చేస్తే అది కొద్దిరోజులకు అవిరైపోతుంది. అదే నీడలో గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే ఒక ఏడాది పాటు ఉంటుంది. అదే డబ్బా మూత తెరిస్తే నిల్వ కాలం కూడా తగ్గుతూ వస్తుంది. అదే 20 డిగ్రీల సెల్సియస్ దగ్గర సుమారు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే 30 డిగ్రీల సెల్సియస్ వద్ద మూడు నెలల పాటు పాడై పోకుండా నిల్వ ఉంటుంది.

డీజిల్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది..?

ఇక పెట్రోల్ అంత ఈజీగా డీజిల్ పాడైపోదు. అయితే డీజిల్‌ను ఎక్కువకాలం నిల్వ ఉంచితే జిగురు ఏర్పడి ఇంజిన్ ఫిల్టర్లు మూతపడేలా చేస్తుంది. అలాగే ఇంధనం రంగు ముదురుగా మారుతుంది. గాలి చొరబడని డబ్బాలో నీడలో డీజిల్ నిల్వ చేస్తే సుమారు ఒక ఏడాది పాటు పాడైపోకుండా ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో డీజిల్ నిల్వ చేయాలంటే ప్రతీ ఆరు నెలలకు ఒకసారి బయోసైడ్ చికిత్స చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు