Viral Video: గుడ్డు పగలకొడితే.. ఒకటి కాదు రెండు కాదు.. డజన్ల కొద్ది సొనలు.. నెటిజన్లు షాకింగ్ కామెంట్స్
గుడ్డు పగిలితే దాని నుంచి ఒక సొన లేదా.. రెండు బయటకు వస్తాయి.. కానీ ఒక గుడ్డు నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సొనలు లోపలి నుంచి బయటకు వచ్చాయి. తాజాగా గుడ్డుకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Viral Video: గుడ్డు సంపూర్ణ ఆహారం. గుడ్డులో ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు ఉన్నాయి. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ ఒక గుడ్డు తినాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అదే సమయంలో.. ఎవరైనా సన్నగా ఉండి.. బరువు తక్కువగా ఉంటే.. ప్రొటీన్లు అధికంగా ఉన్న గుడ్డుని తినమని సూచిస్తున్నారు. గుడ్డు బరువు పెరగడానికి సహాయపడుతుంది. బాడీ బిల్డింగ్ చేసే వారు ప్రతిరోజూ అల్పాహారంగా కోడిగుడ్లను తినడానికి కారణం ఇదే. అయితే గుడ్డు పగిలితే దాని నుంచి ఒక సొన లేదా.. రెండు బయటకు వస్తాయి.. కానీ ఒక గుడ్డు నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సొనలు లోపలి నుంచి బయటకు వచ్చాయి. తాజాగా గుడ్డుకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి పాన్‌లో పెద్ద గుడ్డును పగులగొడుతున్నట్లు మీరు చూడవచ్చు. ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా. నిజానికి గుడ్డు పగలగానే దానిలోపల చాలా పచ్చసొన వస్తుంది. సాధారణంగా గుడ్ల నుండి రెండు పచ్చసొనలు రావడం మనందరం చూసి ఉంటాం. అయితే ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మొత్తం 25 గుడ్ల సొనలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్ల షాక్ తిన్నారు. జనాలు ఆలోచనలో పడ్డారు.. ఇది ఏ పక్షి గుడ్డు అని ప్రశ్నిస్తున్నారు.
గుడ్లకు సంబంధించిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో rising.tech అనే పేజీలో షేర్ చేయబడింది. వీడియోను చివరి వరకు చూడండి, ఇంతకు ముందు మీరు ఇలాంటి గుడ్డును చూసి ఉండరు అని క్యాప్షన్‌లో వినియోగదారు రాశారు. నాలుగు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను దాదాపు 31 వేల మంది లైక్ చేశారు. చాలా మంది వినియోగదారులు ఒకే గుడ్డు నుండి భారీ సంఖ్యలో పచ్చసొనలు రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. వీడియోను చూసిన తర్వాత రకరకాల కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
View this post on Instagram
ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ.. ఈ గుడ్డు ఏ పక్షిది సోదరా అని అడుగుతున్నారు. నేను ఒకసారి రెండు డజన్ల గుడ్లు కొన్నాను. లోపల నుండి రెండు సొనలు బయటకు వచ్చాయి. ఇలాంటి గుడ్లు తినదగినవి కాదని తాను భావిస్తున్నానని ఇంకొకరు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..