AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa : నా కూతురిని నాకు ఇచ్చేయండి.. వీధిలోకి మోనాలిసా తల్లి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫోటో..

మోనాలిసా భోంస్లే.. మొదటి నుంచి సంచలనమే. ఒక్క రోజులోనే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. కట్ చేస్తే సినిమా అవకాశాలు.. ప్రైవేట్ సాంగ్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అంటూ ఆమె పేరు నెట్టింట మారుమోగింది. కథానాయికగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మోనాలిసా.. ఆకస్మాత్తుగా ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.

Monalisa : నా కూతురిని నాకు ఇచ్చేయండి.. వీధిలోకి మోనాలిసా తల్లి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫోటో..
Monalisa Mother
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2026 | 11:40 AM

Share

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన 2025 మహా కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది మోనాలిసా. సహజ సౌందర్యం, తేనే కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె వీడియోస్, ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఆమెకు హిందీలో సినిమా అవకాశాలు వచ్చాయి. మరోవైపు సాంగ్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేస్తూ బిజీగా గడిపేసింది. ఇక ఇటీవల కేరళకు చెందిన తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. గత వారం తన ముస్లిం ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. కేరళలోని ఒక గుడిలో వారి వివాహం చాలా నిరాడంబరంగా జరిగినప్పటికీ, ఈ పెళ్లి త్వరలోనే దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత, చాలామంది ఫర్మాన్‌పై లవ్ జిహాద్ ఆరోపణలు కూడా చేశారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

ఓవైపు మోనాలిసా పెళ్లిపై సోషళ్ మీడియాలో చర్చ నడుస్తుంది. తమ పెళ్లి గురించి ఇదివరకే మోనాలిసా, ఫర్మాన్ లు సమావేశం నిర్వహించి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక ఈ వివాహం పట్ల మోనాలిసా, ఫర్మాన్‌ల కుటుంబాలు ఏమాత్రం సంతోషంగా లేవు . ఇరువైపుల తల్లిదండ్రులు దీనిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫర్మాన్ తండ్రి , మోనాలిసా తండ్రి ఈ వివాహాన్ని తాము ఆమోదించడం లేదని చెప్పారు. ఇప్పుడు, మోనాలిసా తల్లి తన కూతురిని ఇప్పించాలంటూ వీధిలో కూర్చుని వేడుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

పది రోజులుగా తన కూతురు తనతో మాట్లాడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా కూతురిని నాకు ఇచ్చేయండి అంటూ ఆమె వీధులో చేతులు జోడించి వేడుకుంది. తన కూతురుని తలుచుకుని ఏడుస్తూ రోడ్డుపై స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. తన కూతురి గురించి చెబుతూ మోనాలిసా తల్లి ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టేలా చేస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

మోనాలిసా తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురికి మొబైల్ ఫోన్ లేదు. నేను ఆమెతో ఎలా మాట్లాడగలను. ఆమె మైనర్. ఆమెకు ఏమీ అర్థం కాదు. దయచేసి ఆమెను తిరిగి తీసుకురండి. లేకపోతే నేను ఏదైనా తిని చచ్చిపోతాను. నేను నా కూతురిని చూడాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. మోనాలిసా తన ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వడం లేదని ఆమె తండ్రి అంటున్నారు. తన తల్లిదండ్రుల ఆవేదన చూసిన తర్వాత మోనాలిసా పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us