AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheating: ఇంతకంటే దారుణమైన మోసం మరోటి ఉండదు.. కిడ్నీ ఇచ్చి ప్రాణాలు కాపాడిన అమ్మాయిని..

Love Cheating: ప్రేమ గురించి ఎవరిని అడిగినా.. పుంఖాను పుంఖాలుగా స్టోరీలు, కవితలు, కథలు చెబుతారు. ప్రేమ గొప్పదని, పవిత్రమైనదని,

Cheating: ఇంతకంటే దారుణమైన మోసం మరోటి ఉండదు.. కిడ్నీ ఇచ్చి ప్రాణాలు కాపాడిన అమ్మాయిని..
Love Breakup
Shiva Prajapati
|

Updated on: Jul 08, 2022 | 8:36 PM

Share

Love Cheating: ప్రేమ గురించి ఎవరిని అడిగినా.. పుంఖాను పుంఖాలుగా స్టోరీలు, కవితలు, కథలు చెబుతారు. ప్రేమ గొప్పదని, పవిత్రమైనదని, చాలా సున్నితమైనదని కూడా చెబుతారు. ఒకసారి మదిలో ప్రేమ పుడితే.. కట్టే కాలేంత వరకు అది చెరిగిపోదంటారు. అయితే, ప్రస్తుత కాలంలో ప్రేమకు అర్థాలు మారిపోయాయి. క్షణాల్లో ప్రేమ ఒకరి మీద నుంచి మరొకరిపై పుడుతోంది. ఎంత త్వరగా కనెక్ట్ అవుతున్నారో.. అంతే త్వరగా విడిపోవడాలు కూడా అవుతున్నాయి. ఇంకా కీలకం ఏంటంటే.. ప్రేమలో మోసాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. తమ భాగస్వామి శ్రేయస్సులో కోసం ఎదుటి వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటే.. కొందరికి అవేమీ పట్టకపోగా.. వారి త్యాగాలను సైతం మర్చిపోయి వేరే వారి పంచన చేరుతున్నారు.

అలాంటి మోసానికి సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. అందరి కంట కన్నీరు తెప్పిస్తుంది. దీనిని అత్యంత దారుణమైన మోసంగా పరిగణిస్తున్నారు ప్రజలు. ఆ చీటర్‌కు నిజంగా మనసు అనేదే లేదని భగ్గుమంటున్నారు. కన్నీరు పెట్టిస్తున్న ఈ బ్రేకప్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీ చెడిపోయి ప్రాణాపాయంలో తన ప్రియుడిని కాపాడుకునేందుకు ఓ ప్రేయసి పెద్ద త్యాగమే చేసింది. కిడ్నీ చెడిపోయి ఆస్పత్రి పాలైన తన ప్రియుడికి.. ఓ ప్రేయసి తన కిడ్నీని దానం చేసి ప్రాణం పోసింది. అయితే, మొదట ఆ కృతజ్ఞతలు చూపినా.. ఆ తరువాత విశ్వాస ఘాతుకానికి, నమ్మకద్రోహానికి పాల్పడి.. బ్రేకప్ చెప్పాడు. ప్రాణం పోసిన ప్రేయసిని కాదని, మరో అమ్మాయితో జత కట్టాడు.

కాలిఫోర్నియాకు చెందిన అమ్మాయి కొలీన్ లీ హృదయవిదారకమైన గాధ ఇది. కొలీన్ తన బాధను ఓ టీవీ షోలో పంచుకుంది. తాను మోసపోయిన విధానాన్ని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కొలీన్ తన ఇంటికి సమీపంలో నివసించే అబ్బాయితో ప్రేమలో పడింది. మొదట్లో వీరి మధ్య స్నేహం మాత్రమే ఉన్నప్పటికీ క్రమంగా.. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇంతలో.. 17 సంవత్సరాల వయస్సులో కొలీన్ తన ప్రియుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకుంది. ఆ అబ్బాయిని ప్రాణంగా ప్రేమించిన కొలీన్.. అతను బాధపడుతుంటే చూడలేకపోయింది. చిన్న వయసులోనే తన కిడ్నీలో ఒక దానిని అతనికి దానం చేసింది. అలా ఆమె కిడ్నీ దానం చేయడంతో అతను తిరిగి బతికాడు.

కిడ్నీ ఇచ్చిన 7 నెలల తర్వాత బ్రేకప్.. కిడ్నీ దానం చేయడం వల్ల తమ బంధం మరింత బలపడుతుందని తాను భావించానని కొలీన్ చెప్పుకొచ్చింది. అయితే అందుకు విరుద్ధంగా జరిగింది. కిడ్నీ మార్పిడి జరిగిన 7 నెలలకే కొలీన్‌తో విడిపోయి మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు ఆ చీటర్.