Viral: వంటగది సింక్‌లో వింత శబ్ధాలు.. ఓపెన్ చేస్తే ఒకటి వెంట మరొకటిగా..
Viral: సాధారణంగానే.. పామును చూస్తే చాలా మంది హడలిపోతుంటారు. అంత దూరంలో కనిపిస్తేనే.. ఇటువైపు నుంచి పరుగలు తీస్తారు.
Viral: సాధారణంగానే.. పామును చూస్తే చాలా మంది హడలిపోతుంటారు. అంత దూరంలో కనిపిస్తేనే.. ఇటువైపు నుంచి పరుగలు తీస్తారు. అలాంటి ఏకంగా నట్టింట్లోకి వస్తే.. అది కూడా వంటగదిలోంచి బుసలు కొడుతూ.. ఒకటి ఒకటిగా మొత్తం 22 పాములు బయటకు వచ్చాయి. అవి చూసి హడలిపోయారు ఇంట్లోని వారు. ఈ ఘటన ఇండర్‌లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండోర్‌లోని రౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేట్ రోడ్‌లో ఉన్న సత్య మిత్ర రాజలక్ష్మి అనే కాలనీ ఉంది. ఇక్కడ నివసించే నితిన్ పాటిల్ ఇంట్లోని కిచెన్ సింక్‌లోంచి పాములు వరుసగా బయటకు వచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటిగా 7 రోజుల్లో దాదాపు 22 పాములు బయటకు వచ్చాయి. వాష్ బేసిన్ లోంచి అడుగు పొడవైన పాము బయటకు వచ్చింది. ఆ తరువాత ఒకదాని తరువాత ఒకటి మొత్తం 22 పాములు బయటుకు వచ్చాయి. వాటిని చూసి హడలిపోయారు ఇంటివాసులు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఇల్లంతా సెర్చ్ చేయగా.. అక్కడక్క పాములు కనిపించాయి. వాటన్నింటినీ పట్టుకున్నారు అటవీ అధికారులు. కాగా, పాముల బెడదతో ఇంట్లోని వారు పొరుగింట్లో బస చేయాల్సి వచ్చింది. కాగా, ఇంట్లో పట్టుకున్న పాములను అటవీ అధికారులు ఫారెస్ట్ ఏరియాలో వదిలిపెట్టారు.