Viral Video: లవర్‌ని పెళ్లికి పిలిచిన ప్రియురాలు.. కట్‌చేస్తే.. చివర్లో దిమ్మతిరిగే షాక్.. వైరల్ వీడియో

ముబారక్​పుర్​గ్రామానికి చెందిన ముఖేశ్ అనే యువకుడు, ఓ యువతి ఏడాది కాలంగా లవ్ చేసుకుంటున్నారు. అయితే, ఈ విషయం నచ్చని యువతి కుటుంబ సభ్యులు, ఆమెకు వేరే యువకుడితో వివాహం జరిపించేందుకు ప్లాన్ చేశారు.

Viral Video: లవర్‌ని పెళ్లికి పిలిచిన ప్రియురాలు.. కట్‌చేస్తే.. చివర్లో దిమ్మతిరిగే షాక్.. వైరల్ వీడియో
Marriage Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 08, 2022 | 9:28 PM

బీహార్‌లోని నలందలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. అందమైన ప్రేమ యువకుడికి ఖరీదైనదిగా మారింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పసుపు చొక్కా ధరించిన యువకుడు వరమాల సందర్భంగా వేదికపైకి చేరుకుని చేసిన పనితో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. హర్నౌత్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముబారక్​పుర్​గ్రామానికి చెందిన ముఖేశ్ అనే యువకుడు, ఓ యువతి ఏడాది కాలంగా లవ్ చేసుకుంటున్నారు. అయితే, ఈ విషయం నచ్చని యువతి కుటుంబ సభ్యులు, ఆమెకు వేరే యువకుడితో వివాహం జరిపించేందుకు ప్లాన్ చేశారు. పెళ్లి జరగుతుండగా ముఖేశ్​ అక్కడికి చేరుకున్నాడు. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె వరమాలలు మార్చుకుంటుండగా వేదికపై చేరుకుని, వధువు మెడలో వరమాల వేసి, బొట్టు కూడా పెట్టేశాడు. ఈ తతంగం అంతా చూసిన వధువు తరపు బంధువులు.. సదరు యువకుడిని పట్టుకుని కొట్టేశారు. దీంతో ప్రియుడి కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించడంతో వెంటనే సదర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ ప్రథమ చికిత్స తర్వాత ఉన్నత కేంద్రానికి రెఫర్ చేశారు.

ఈ క్రమంలో ప్రియుడు ముఖేష్ మాట్లాడుతూ, మేమిద్దరం ఇష్టపడ్డాం. ఏడాదిగా ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమ విషయం అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో ఆమెకు పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. దీంతో నా ప్రియురాలు నాతో మాట్లాడింది. మావాళ్లు రేపు పెళ్లి చేస్తున్నారు.. వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలని ఫోన్‌లో కోరింది.” అని చెప్పుకొచ్చాడు.

ప్రియుడు చేసిన తతంగాన్ని చూసిన వరుడు.. వధువును పెళ్లి చేసుకోకుండానే వేదికపై నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. దీనిపై విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..