Telugu News Sports News Cricket news 41st or 60th birthday, the footprints of Team india former captain MS Dhoni will never fade away in indian cricket history
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్రలు.. మిస్టర్ కూల్ కెరీర్‌లో లెక్కకుమించి..
ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, దేశ ప్రజలకు ఎన్నో మధురమైన విజయాలను MSD అందించాడు. 3 ఐసీసీ ట్రోఫీలతోపాటు నాలుగు ఐపీఎల్ టైటిల్స్, 2 ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు, టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ పొజిషన్‌కు టీమిండియాను..
జార్ఖండ్ డైనమైట్ ధోనీ.. ఇండియన్ క్రికెట్‌ను మలుపు తిప్పిన సారథిగా పేరుగాంచాడు. 16 ఏళ్ల జర్నీలో మిస్టర్ కూల్.. భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించి, అభిమానుల మదిలోనూ చిరస్థాయిగా నిలిచాడు. ధోని (MS Dhoni) తన కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20ఐలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ధోనీ.. ఐపీఎల్‌లో కొనసాగుతూ, తన ఫ్యాన్స్‌ను ఉర్రూతలుగిస్తున్నాడు. IPL 2022లో అతని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ప్రత్యేకంగా లేకపోవడంతో.. అంతా నిరాశపడ్డారు. 41వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎంతో సందడిగా కనిపించారు. అభిమానుల్లో మాత్రం ఇప్పటికీ ఆయనపై ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. ధోని పుట్టిన రోజు వస్తే చాలు.. ఇప్పటికీ కటౌట్లు కట్టి తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నారు. భారత క్రికెట్‌లో ధోని మార్క్ ముద్రలను చెరిపేయడం చాలా కష్టం. ఆటతోనే కాదు.. తన స్టైల్‌తోనూ ఓ మార్క్ సెట్ చేశాడు.
కాగా, ధోనీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు అభిమానులు కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో భారత మాజీ కెప్టెన్ 41 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి, ధోనిపై ప్రత్యేకంగా అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఫొటోలో ధోనీ హెలికాప్టర్ షాట్‌ను డిజైన్ చేశారు. ధోనీ కటౌట్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో కేరళలో 35 అడుగుల కటౌట్‌లు, చెన్నైలో 30 అడుగుల కటౌట్‌లను ఏర్పాటు చేసి, మిస్టర్ కూల్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు.
MS Dhoni’s 41st birthday will be celebrated with a 41 feet cutout in Vijayawada district. pic.twitter.com/9gWuq4bNHs
ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, దేశ ప్రజలకు ఎన్నో మధురమైన విజయాలను MSD అందించాడు. 3 ఐసీసీ ట్రోఫీలతోపాటు నాలుగు ఐపీఎల్ టైటిల్స్, 2 ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు, టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ పొజిషన్‌కు టీమిండియాను చేర్చిన ఘనత ధోని సొంతం చేసుకున్నాడు. వ్యక్తిగతంగా వన్డే క్రికెట్‌లో 10 వేల పరుగులు సాధించి, భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నాడు.