AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బరాత్‌కు అడ్డుపడిన భారీ వర్షం.. బంధువుల ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే.. నెట్టింట వైరల్ వీడియో..

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. పరదేశీ పురాలో ఓ వివాహ వేడుకలో బరాత్ మొదలైంది. రోడ్డు మీద పెళ్లి కొడుకు ఓ వాహనంలో ముందు వెళ్తున్నాడు. పెళ్లి కొడుకు వెనుకాల బంధువులతోపాటు స్నేహితులు బరాత్‌లో స్టెప్పులేకుంటూ వెనకాలే వెళ్తున్నారు.

Viral Video: బరాత్‌కు అడ్డుపడిన భారీ వర్షం.. బంధువుల ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే.. నెట్టింట వైరల్ వీడియో..
Barat Viral Video
Venkata Chari
|

Updated on: Jul 06, 2022 | 6:17 PM

Share

దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ విషయం పక్కన పెడితే, అషాడంలో మన దగ్గర పెళ్లిళ్లు జరగవు. కానీ, దేశంలో కొన్ని ప్రాంతాలో ఆషాడంలోనూ పెళ్లిళ్లు జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకకు వర్షం అడ్డుపడింది. దీంతో వాళ్లు చేసిన పనితో నెట్టింట్లో తెగ వైరలవుతున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. ఎంతో ఖర్చు పెట్టి మరీ పెళ్లి తంతును చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వరుడితో పెళ్లి వేడుకకు తరలి వెళ్లేందుకు అంతా సిద్ధమయ్యారు. కానీ, ఇంతలో జోరు వాన అడ్డుపడింది. దీంతో తెలివిగా ఆలోచించిన వరుడి బంధువులు.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగినట్లు వీడియోలో చూడొచ్చు.

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. పరదేశీ పురాలో ఓ వివాహ వేడుకలో బరాత్ మొదలైంది. రోడ్డు మీద పెళ్లి కొడుకు ఓ వాహనంలో ముందు వెళ్తున్నాడు. పెళ్లి కొడుకు వెనుకాల బంధువులతోపాటు స్నేహితులు బరాత్‌లో స్టెప్పులేకుంటూ వెనకాలే వెళ్తున్నారు. ఈ క్రమంలో జోరువాన మొదలైంది. వారి ఆనందానికి వర్షం అడ్డుపడడంతో, నిరుత్సాహపడకుండా, వెంటనే ఓ టార్పలిన్‌తో తడవకుండా బరాత్‌ను కొనసాగించారు. ఇలాంటి ఘటనలు భారత్‌లో మాత్రమే జరుగుతున్నాయని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..