AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. ఎఫ్‌1 రేస్ చరిత్రలోనే.. వైరల్ వీడియో..

F1 British Grand Prix 2022: బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో రెండు కార్లు ఢీకొన్న వీడియో చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఒక కారు రేస్ ట్రాక్ నుంచి బోల్తా పడి, గ్యాలరీవైపు వెళ్లినట్లు వీడియోలో చూడొచ్చు.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. ఎఫ్‌1 రేస్ చరిత్రలోనే.. వైరల్ వీడియో..
Viral Video
Venkata Chari
|

Updated on: Jul 04, 2022 | 3:34 PM

Share

బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో ఓ భయంకరమైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద వీడియోని చూస్తే, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. కొందరు ఈ ప్రమాదాన్ని ఫార్ములా వన్ రేస్ చరిత్రలోనే అతిపెద్ద క్రాష్‌గా అభివర్ణిస్తున్నారు. బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో రేసులో ప్రమాదం జరిగిన కారులో చైనీస్ డ్రైవర్ జౌ గ్వాన్యు ప్రయాణిస్తున్నాడు. జౌ గ్వాన్యు కారును వెనుక ఉన్న మరో కారు ఢీకొట్టింది. దీంతో చైనీస్ డ్రైవర్ కారు అదుపు తప్పింది. కారు బోల్తా పడి, కారు పైభాగం రోడ్డుకు తగలగానే నిప్పురవ్వలు చెలరేగడంతో పాటు మంటలు అంటుకున్నాయి. జౌ గ్వాన్యు కారు రేస్ ట్రాక్‌పై నుంచి జారిపడి ఫెన్సింగ్‌పై పడినట్లు వీడియోలో కనిపిస్తోంది.

బ్రిటిష్ గ్రాండ్ ప్రి 2022లో భారీ ప్రమాదం..

ఇవి కూడా చదవండి

బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో, ఈ భయంకరమైన ప్రమాదం మొదటి ల్యాప్‌లోనే జరిగింది. జౌ గ్వాన్యు కారు మలుపు వద్దకు చేరుకోబోతుండగా, వారి వెనుక ఉన్న కారు అదుపు తప్పి వెనుక నుంచి వారి కారును ఢీకొట్టింది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ ప్రమాదాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఫార్ములా 1 గవర్నింగ్ బాడీ, FIA, ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్‌లిద్దరూ స్పృహలో ఉన్నారని, వైద్య పరీక్షలు చేయించామని తెలిపారు.

భయాందోళనలకు గురైన ప్రేక్షకులు..

బ్రిటీష్ గ్రాండ్ ప్రి 2022లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియోని అనేక కోణాల్లో రికార్డైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరొక వీడియోలో, జౌ గ్వాన్యు కారు ఢీకొన్న తర్వాత ఫెన్సింగ్ వైపు కదలడం చూడొచ్చు. ఇది ఫెన్సింగ్ దగ్గర కూర్చున్న ప్రేక్షకులను భయపెట్టింది. వారివైపు దూసుకరావడంతో వారి సీట్లను వదిలి పరుగెత్తారు. Zhou Guanyu కారు వెనుక నుండి ఢీకొట్టింది. అయితే ఘోర ప్రమాదం జరిగినా చైనా డ్రైవర్ స్పృహ కోల్పోకుండా మాట్లాడుతుండటం విశేషం. అనంతరం గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. వీడియోలో, మెర్సిడెస్ డ్రైవర్ రస్సెల్ జౌ గ్వాన్యు కారును వెనుక నుంచి ఢీకొట్టడం కనిపిస్తుంది.