Samantha Ruth Prabhu: అన్‌హ్యాపీ మ్యారేజ్ లైఫ్‌కి కారణం మీరే.. ఓ ప్రశ్న‌కు సమంతా ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha On Unhappy Marriage: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన నటీమణులలో ఒకరైన సమంత.. తన డేటింగ్ లైఫ్ గురించి వచ్చిన పుకార్లపై నాగ చైతన్య అభిమానులకు బలి అయింది. అయితే, వీటిపై స్ట్రాంగ్ కౌంటర్‌తో..

Samantha Ruth Prabhu: అన్‌హ్యాపీ మ్యారేజ్ లైఫ్‌కి కారణం మీరే.. ఓ ప్రశ్న‌కు సమంతా ఆసక్తికర వ్యాఖ్యలు
Samantha On Unhappy Marriage In Koffee With Karan 7
Venkata Chari

|

Jul 03, 2022 | 10:15 AM

Koffee With Karan 7: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన నటీమణులలో ఒకరైన సమంత.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ మధ్య నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్, పాన్ ఇండియాగా వచ్చిన ‘పుష్ప’ సినిమాలోని ‘ఓ అంటావా’ పాటతో దేశ వ్యాప్తంగా తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసింది. తాజాగా బాలీవుడ్‌లో బాగా పాపులర్ షోలో సమంత సందడి చేయనుంది. ఈమేరకు విడుదలైన ఓ ట్రైలర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. విడాకులు ప్రకటించినప్పటి నుంచి వాటి గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. అయితే తాజాగా ఈ సౌత్ నటి తన వైవాహిక జీవితంపై ఓపెన్‌గా మాట్లడినట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ షో ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 7’లో తన వైవాహిక జీవితంపై కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను కరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ప్రోమోలో సమంత వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ కనిపించింది. ప్రోమోలో నటి మాట్లాడుతూ, ‘అన్‌హ్యాపీ మ్యారేజ్ లైఫ్‌‌కి కారణం మీరే. మీరు జీవితాన్ని K3G (కభీ ఖుషీ కభీ ఘమ్) గా చూపించారు. కానీ, నిజ జీవితం ‘KGF’ లాంటిది’ అంటూ సమంత బాంబ్ పేల్చింది. సమంత మాటలు విని కరణ్ కూడా నవ్వుకున్నాడు.

అయితే, తన వృత్తిపరమైన జీవితానికి లేదా వ్యక్తిగతమైన ఏ అంశమైనా సోషల్ మీడియాతో చర్చలకు దారి తీస్తున్న సంఘటనలు ఎన్నో ఇప్పటికే చూశాం. అభిమానులు కూడా ఆమెకు సంబంధించిన వార్తల కోసం ఎదురుచూస్తూనే ఉంటుంటారు. ఇదే క్రమంలో సమంత కొన్ని విషలయాలపై ట్రోల్స్ బారిన పడిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. మొన్న తన డేటింగ్ లైఫ్ గురించి వచ్చిన పుకార్లపై నాగ చైతన్య అభిమానులు బాగా ట్రోల్ చేశారు. దాంతో ట్రోలర్లకు మీ పని మీరు చూసుకోండి, మీ కుటుంబాలపై ఫోకస్ చేయండి అంటూ ఈ సౌత్ బ్యూటీ బాగానే కౌంటర్ ఇచ్చింది. కొంత కాలం క్రితం సమంత నాగ చైతన్య నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. సమంతా అభిమానులు ఇప్పటికీ నాగ చైతన్యతో కలిసిపోవాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ‘కాఫీ విత్ కరణ్ 7’ ప్రోమోలో ఈ సీజన్‌లో చూడబోయే అతిథులను కూడా చూపించారు. ఈసారి కరణ్ షోలో అలియా, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, సమంత రూతు ప్రభు, అనన్య పాండే, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్, అనిల్ కపూర్, వరుణ్ ధావన్ కనిపించబోతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu