Actor Kishore: సినీ పరిశ్రమలో విషాదం.. క్యానర్స్‌తో కన్నుమూసిన యువ నటుడు..!

చిత్ర పరిశ్రమలో వరుస విషాదకర ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ప్రముఖ నటి మీనా భర్త చెన్నైలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ నటుడు కేవలం 30 ఏళ్లకే కన్నుమూశారు.

Actor Kishore: సినీ పరిశ్రమలో విషాదం.. క్యానర్స్‌తో కన్నుమూసిన యువ నటుడు..!
Actor Kishore
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 03, 2022 | 9:48 PM

Actor Kishore: చిత్ర పరిశ్రమలో వరుస విషాదకర ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ప్రముఖ నటి మీనా భర్త చెన్నైలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ నటుడు కేవలం 30 ఏళ్లకే కన్నుమూశారు. అస్సామీ నటుడు కిశోర్‌ దాస్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశాడు. క్యాన్సర్‌తో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అతడు తుదిశ్వాస విడిచాడు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకున్నది.

అస్సామీ నటుడు కిషోర్ దాస్ క్యాన్సర్ నాలుగో దశకు చెన్నైలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో ప్రాణాలను కోల్పోయాడు. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే కొవిడ్‌-19 సమస్యలతో బాధపడుతున్నాడు. కొంత కాలం గౌహతిలో కూడా చికిత్స పొందారు. నటుడు గత నెలలో ఆసుపత్రిలో ఉండగా, సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్‌ చేశారు. అందులో అతను ఆసుపత్రి బెడ్‌పై కనిపించాడు. కాగా, ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాల వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

అసోంలోని కమ్రూప్‌ ఆయన స్వస్థలం. అయితే, కరోనా ప్రొటోకాల్స్‌ నేపథ్యంలో అంత్యక్రియలను శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. అస్సామీ ఇండ్రస్టీలో ఎక్కువగా పని చేసిన కిశోర్‌ దాస్‌.. బిధాత, బంధున్, నెదేఖా ఫగన్ తదితర అస్సామీ టెలివిజన్‌ షోలతో మంచి గుర్తింపును పొందాడు. అలాగే కిశోర్ దాస్ అస్సామీలో 300కి పైగా మ్యూజిక్ వీడియోల్లో నటించాడు. ‘తురుట్‌ తురుట్‌’ పాట.. అస్సామీ ఓవర్‌ నైట్‌ స్టార్‌గా ఎదిగాడు. దాస్ చివరిసారిగా ‘దాదా తుమీ డస్తో బోర్’ అనే అస్సామీ చిత్రంలో కనిపించాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!