Director Maruthi: ఆ విషయంలో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన డైరెక్టర్ మారుతి.. పక్కా కమర్షియల్ సక్సెస్‌మీట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
జూలై 1న విడుదలైన ఈ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న
మ్యాచో హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం పక్కా కమర్షియల్ (pakka commercial). ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించగా..జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. జూలై 1న విడుదలైన ఈ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. పక్కా కమర్షియల్ చిత్రాన్ని సక్సెస్ చేసినందకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్ మారుతి. మళ్లీ ఇంకా మంచి కంటెంట్‌తో తన తదుపరి సినిమాలతో వస్తానంటూ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ..” జులై 1న విడుదలైన “పక్కా కమర్సియల్” సినిమా మేము అనుకున్నట్లే అందరి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది. నా సినిమాల్లో ఉండే ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాలో కూడా ప్లే చేయడంతో ఎక్కడా ఫన్ తగ్గకుండా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెసేజ్ లు పెడుతున్నారు. నా సినిమాకు వచ్చే ఆడియన్స్ ఏమి ఎక్ష్పెక్త్ చేస్తారో అవన్నీ ఇందులో ఉన్నాయి. నా ప్రివియస్ సినిమాలను హిట్ చేసినట్లే ఈ సినిమాకు వచ్చి చూసి హిట్ చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. నిన్న అరవింద్ గారు నాతోఈ సినిమా విడుదలైన అన్నీ చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్యాండమిక్ తరువాత వచ్చిన పెద్ద సినిమాల వచ్చాయి ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలకు ఆడియన్స్ థియేటర్ కు రావడం లేదు. అయితే ఇలాంటి ఆన్ సీజన్ టైమ్ లో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరించడంతో షో తరువాత షో కు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. గోపీచంద్ ను చాలా రోజుల తరువాత బాగా చూయించారు , రాశి ఖన్నా ట్రాక్ బాగుంది. రావురమేష్ విలనిజం చాలా బాగుందని, మేము అనుకున్న దానికంటే ఈ సినిమా బాగుందని చెపుతున్నారు. నాకిలాంటి మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకా బెటర్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాను” అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.