Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjali: ఆ యంగ్ హీరో సినిమాలో అంజలి స్పెషల్ సాంగ్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్..

ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్పెషల్ సాంగ్‏తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Anjali: ఆ యంగ్ హీరో సినిమాలో అంజలి స్పెషల్ సాంగ్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్..
Anjali
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2022 | 4:20 PM

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది హీరోయిన్ అంజలి (Anjali). ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్పెషల్ సాంగ్‏తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మాచర్ల నియోజకవర్గం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో అంజలి స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.

పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో అంజలి స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. ఇక అంజలి ఐటెం సాంగ్ చేయడం మొదటి సారి కాదు. గతంలోనూ ఆమె స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో ఐటెం సాంగ్ చేసింది అంజలి. ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ లో అలరించనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయనున్నారు. ఇందులో కృతి శెట్టి, క్యాథరిన్ టెస్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో నితిన్ కలెక్టర్ గా కనిపించనున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిగ్గుపడుతూ.. తన ప్రేమను వ్యక్తపరుస్తున్న జబర్దస్త్ బ్యూటీ రష్మీ
సిగ్గుపడుతూ.. తన ప్రేమను వ్యక్తపరుస్తున్న జబర్దస్త్ బ్యూటీ రష్మీ
లా సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
లా సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈటాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈటాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన
యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన
ఇంటర్ ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలకు RJC CET 2025 నోటిఫికేషన్ జారీ
ఇంటర్ ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలకు RJC CET 2025 నోటిఫికేషన్ జారీ
ఫస్ట్‌ మ్యాచ్‌లోనే 300 గ్యారెంటీనా?
ఫస్ట్‌ మ్యాచ్‌లోనే 300 గ్యారెంటీనా?
భయ్యా.. ఎక్కడ? సన్నీయాదవ్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ
భయ్యా.. ఎక్కడ? సన్నీయాదవ్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ
ఆర్సీబీ గెలిచింది సాల్ట్‌, కోహ్లీ వల్ల కాదు..!
ఆర్సీబీ గెలిచింది సాల్ట్‌, కోహ్లీ వల్ల కాదు..!
ఆ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌తో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డేటింగ్!
ఆ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌తో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డేటింగ్!
APPSC గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్ధులకు మరో ఛాన్స్.. మిస్‌ చేసుకోకండి
APPSC గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్ధులకు మరో ఛాన్స్.. మిస్‌ చేసుకోకండి