Shruthi Haasan: ప్రభాస్‏లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్..

ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్..

Shruthi Haasan: ప్రభాస్‏లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్..
Shruthi Haasan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2022 | 3:55 PM

టాలీవుడ్ అగ్రకథానాయిక శ్రుతి హాసన్ (Shruthi Haasan) ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీదుంది. చేతి నిండా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ చిన్నది. ఇటీవల క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శ్రుతి ఇప్పుడు.. తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్.. హీరో ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. “కేజీఎఫ్ సినిమా చూసినప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రపంచంలోని కథలను.. పాత్రలను అద్బుతంగా చూపించడం చాలా నచ్చింది. అతని సినిమాలు చూస్తున్నప్పుడు అద్భుతమైన ప్రపంచంలోకి వెళతాము. తాను సృష్టించిన పాత్రలు ప్రపంచంలో ఎలా ఉంటాయో స్పష్టంగా చెప్పగలడు. అలాగే సలార్ షూటింగ్ కు ముందు ప్రభాస్ గురించి అంతగా తెలియదు. కేవలం హాలో.. హాయ్ అని మాత్రమే పలకరించుకునేవాళ్లము. కానీ సలార్ సినిమా షూటింగ్ సమయంలో తన టీమ్ గురించి మొత్తం తెలుసుకున్నాను. అతను చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాడు. అతనితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. షూటింగ్ సమయంలో అనేక రకాల వంటకాలను తన టీం తీసుకువస్తారు. ప్రజలకు ఆహారం ఇచ్చేవారికి ఈ ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. అతను ఎంతో ప్రేమతో ఇతరులకు ఆహారాన్ని అందిస్తాడు. ప్రభాస్ లో ఉండే బెస్ట్ క్వాలిటీస్ లో ఇది ఒకటి ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్ మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవికి జోడిగా మెగా 154, అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణకు జోడిగా ఎన్బీకే 107 మూవీలో నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.