Satyadev: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. సత్యదేవ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్యదేవ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు.

Satyadev: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. సత్యదేవ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్..
Satyadev
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 15, 2022 | 2:32 AM

కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సత్యదేవ్ (Satyadev). హీరోఐజం మాత్రమే కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకుల మనసులో ప్రత్యక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవలే గాడ్సే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీనే కాకుండా తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు ఈ యంగ్ హీరో. డైరెక్టర్ వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం కృష్ణమ్మ. జూలై 4న సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్యదేవ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఆ కత్తి పట్టుకుని స‌త్య‌దేవ్ నిలుచుకున్నారు. మంచి, చెడుల కలయిక నది నడత… పగ, ప్రేమ కలయిక మనిషి నడక అనే ఓ భావం ఎలివేట్ అవుతుంది. కృష్ణమ్మ అనే టైటిల్ కూడా ఎంతో పవర్ ఫుల్‌గా అనిపిస్తోంది. ఇక ఈ యాక్షన్ మూవీకి సన్నీ కూరపాటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కాళ భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద.. కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!