F3 Movie: ‘ఎఫ్ 3’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే ?..

విక్టరీ వెంకటేష్.. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించగా.. మిల్కీబ్యూటీ తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా కథానాయికలుగా అలరించారు.

F3 Movie: 'ఎఫ్ 3' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే ?..
F3
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2022 | 2:40 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 (F3) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్.. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించగా.. మిల్కీబ్యూటీ తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా కథానాయికలుగా అలరించారు. ఫన్ అండ్ ఫెంటాస్టిక్ ఫ్రస్టేషనల్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో సీన్ సీన్‌కి.. స్క్రీన్ మీద పేలుతున్న పంచులకీ.. ఫన్ ఫుల్గా ఫీలయ్యారు ఇదే ఆడియన్స్. ఎఫ్ 2′ సినిమాలోని ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ను ఈసారి ‘ఎఫ్ 3’ లో డబ్బు నేపథ్యంలో చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇక ఇప్పటివరకు థియేటర్లలో సందడి ఈ మూవీ ఇప్పుడు డిజిటిల్ స్ట్రీమింగ్ కోసం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎఫ్ 3 సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‏లో జూలై 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. మే 27న థియేటర్లలో విడుదలై ఈ సినిమా దాదాపు 50 రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించగా..పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.