IND vs ENG: సత్తా చాటిన భారత ఫాస్ట్ బౌలర్లు.. 4 ఏళ్ల నాటి రికార్డ్‌కు బ్రేకులు..

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో 2018 నాటి ఓ రికార్డ్‌ను బ్రేక్ చేశారు.

IND vs ENG: సత్తా చాటిన భారత ఫాస్ట్ బౌలర్లు.. 4 ఏళ్ల నాటి రికార్డ్‌కు బ్రేకులు..
Ind Vs Eng Indian Pacers
Follow us

|

Updated on: Jul 03, 2022 | 8:41 AM

ఐదో టెస్టుకు ముందు టీమిండియా ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొంది. టీమిండియా సారథి రోహిత్‌కు కరోనా పాజిటివ్ నుంచి కేఎల్ రాహుల్ గాయం వరకు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ మార్పులతో భారత ఆటగాళ్లు ఏమాత్రం బెదరలేదు. ఆటలోనూ ఏమాత్రం తగ్గలేదు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా, మొదట్లో కొంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నా.. పంత్ ఆగమనంతో తిరుగలేకుండా సాగిపోయింది. మొత్తంగా బ్యాటింగ్ రాణించి భారీ స్కో్ర్ చేసింది. అనంతరం బౌలర్ల తమ వంతు కీలక పాత్ర పోషిస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా భారత ఫాస్ట్ బౌలర్లు(Indian Pacers).. తమ పదునైన బౌలింగ్‌తో ఇంగ్లీష్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో జరుగుతోన్న పటౌడీ సిరీస్‌లో భారత పేసర్లు తమ 4 ఏళ్ల రికార్డును తామే బద్దలు కొట్టారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చివరిసారిగా భారత ఫాస్ట్ బౌలర్లు రికార్డు సృష్టించింది కూడా ఇంగ్లాండ్‌లోనే కావడం విశేషం. 2018 రికార్డును బద్దలు కొట్టి, మెరుగ్గా రాణించారు. టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్ల రికార్డును బ్రేక్ చేసి, సరికొత్త రికార్డును నెలకొల్పారు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు తమ గత రికార్డును కొల్లగొట్టి, 2018 సంవత్సరంలో జరిగిన పటౌడీ సిరీస్‌లో, భారత ఫాస్ట్ బౌలర్లు అంతా కలిసి 61 వికెట్లు పడగొట్టారు. ఇది ఇప్పటివరకు ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లుగా నిలిచింది. కానీ. ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసే వరకు భారత ఫాస్ట్ బౌలర్లు ఇప్పటివరకు 67 వికెట్లు పడగొట్టారు.