IND vs ENG 1st T20: టాస్ గెలిచిన టీమిండియా.. ప్లేయింగ్ 11లో వీరికి చోటు
ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ - ఇండియా (India - England) టీ - 20 సిరీస్ లో మొదటి టీ -20 మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ టీ-20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ....
ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ – ఇండియా (India – England) టీ – 20 సిరీస్ లో మొదటి టీ -20 మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ టీ-20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలో ఇంగ్లీష్ జట్టుతో తలపడనుంది. అయితే జట్టు నిండా హిట్టర్లతో ఉన్న ఇంగ్లాండ్‌ను ఈ సిరీస్‌లో ఓడించడం భారత్‌కు సవాలే. మోర్గాన్ రిటైరైన నేపథ్యంలో ఈ సిరీస్‌తోనే ఇంగ్లాండ్ కెప్టెన్‌గా జోస్ బట్లర్ ఇన్నింగ్స్ మొదలు కానుంది. భారత తరఫున బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ నేడు అరంగేట్రం చేయనున్నాడు. ఈ యువ ఆటగాడికి రోహిత్ శర్మ డెబ్యూ క్యాప్ అందించాడు. భారత కెప్టెన్సీ రోహిత్ శర్మ (Rohit Sharma) చేతిలో ఉండగా, ఇంగ్లండ్ కమాండ్ జోస్ బట్లర్ చేతిలో ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టెస్ట్‌లో పాల్గొనే ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇచ్చారు. నేటి మ్యాచ్‌లో టీమిండియాలో రోహిత్ శర్మతో పాటు ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భాగమైన ఆటగాళ్లు కనిపించనున్నారు. ఈ సిరీస్‌లో ఎడ్జ్‌బాస్టన్ టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ బరిలోకి దిగనుంది.
జట్లు:
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్(w/c), డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లీ, మాథ్యూ పార్కిన్సన్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్