AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Record: బకాసురిని సిస్టర్ ఈమె.. వేగంగా ఆహారం తినే విషయంలో 27 రికార్డ్స్.. తాజాగా బ్రేక్స్ ఫాస్ట్ లో సరికొత్త రికార్డ్..

భారీ బ్రేక్ ఫాస్ట్ రికార్డ్.. లియా కంటే ముందు వారం రోజుల క్రితం ఓ వక్తి పేరున నమోదు చేయబడింది. అతను 12 నిమిషాల 50 సెకన్లలో ఈ భారీ బ్రేక్ ఫాస్ట్ ని లాగించేశాడు. అయితే రెండు వారాల క్రితం నమోదు చేయబడిన ఈ రికార్డ్ ను లియా కేవలం రెండు వారాల్లోనే బ్రేక్ చేసింది.   

World Record: బకాసురిని సిస్టర్ ఈమె.. వేగంగా ఆహారం తినే విషయంలో 27 రికార్డ్స్.. తాజాగా బ్రేక్స్ ఫాస్ట్ లో సరికొత్త రికార్డ్..
Leah Shutkever
Follow us
Surya Kala

|

Updated on: Jul 06, 2022 | 10:25 AM

World Record: కొంతమంది ఆహార ప్రియులు.. రకరకాల ఆహార పదార్ధాలను తినడానికి, పానీయాలను తాగడానికి ఇష్టపడతారు. మరికొందరు అయితే ఒక అడుగు ముందుకేసి.. రుచికరమైన వంటకాలను తినడం కోసం ప్రపంచాన్ని చేట్టేస్తారు. అదే సమయంలో.. ఆహారాన్ని తినే దానికంటే ఎక్కువగా తిని గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ వ్యక్తులు సాధారణ వ్యక్తి కంటే చాలా ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఇలాంటి భోజన ప్రియులకు ఆహారం పట్ల మక్కువ వేరే స్థాయిలో ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఆహారం తిని.. సరికొత్త కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన వారు చాలామంది ఉన్నారు. తాజాగా బ్రిటన్‌కు చెందిన ఒక మహిళ తినడంలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. యూట్యూబర్ లియా బ్రేక్‌ఫాస్ట్ తింటూ సరికొత్త రికార్డు సృష్టించింది.

మీడియా నివేదికల ప్రకారం, UKలోని బర్మింగ్‌హామ్‌లో జన్మించిన లియా షుట్‌కేవర్.. అత్యంత వేగంగా ఆహారాన్ని తినే విషయంలో ఇప్పటివరకు 27 ప్రపంచ రికార్డులను సృష్టించింది. తాజాగా దేశంలోనే అతిపెద్ద బ్రేక్‌ఫాస్ట్ ఛాలెంజ్‌ని పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. లియా కేవలం 8 నిమిషాల్లో 8 వేల కేలరీల బ్రేక్‌ఫాస్ట్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది.

వీడియో ఇక్కడ చూడండి : అల్పాహారంలో ఏముంది?

లియా పూర్తి చేసిన హ్యూస్ బ్రేక్ ఫాస్ట్ ఛాలెంజ్‌లో ఐదు గుడ్లు, ఐదు సాసేజ్‌లు, ఐదు బేకన్, ఐదు టమోటాలు, ఐదు హాష్ బ్రౌన్స్  లతో పాటు ఐదు కప్పుల బ్లాక్ పుడ్డింగ్ ఉన్నాయి, అదనంగా ఐదు టోస్ట్‌లు, ఐదు గిన్నెల బీన్స్ , ఐదు బౌల్స్ పుట్టగొడుగులు. ఈ బ్రేక్ ఫాస్ట్ పూర్తి కేలరీలను లెక్కిస్తే..  లియా కేవలం 8 నిమిషాల్లో మొత్తం 8 వేల కేలరీలు తిని తన బ్రేక్ ఫాస్ట్ ని ముగించింది. ఈ కేలరీలు సాధారణ బ్రేక్ ఫాస్ట్ తో పోలిస్తే.. ఈ కేలరీలు చాలా ఎక్కువ. అదే వయసులో ఉన్న అమ్మాయి.. ఈ రేంజ్ లో బ్రేక్ ఫాస్ట్ ఒక వారం పాటు తింటుంది.

రెండు వారాల్లోనే రికార్డు బద్దలైంది

అయితే ఈ భారీ బ్రేక్ ఫాస్ట్ రికార్డ్.. లియా కంటే ముందు వారం రోజుల క్రితం ఓ వక్తి పేరున నమోదు చేయబడింది. అతను 12 నిమిషాల 50 సెకన్లలో ఈ భారీ బ్రేక్ ఫాస్ట్ ని లాగించేశాడు. అయితే రెండు వారాల క్రితం నమోదు చేయబడిన ఈ రికార్డ్ ను లియా కేవలం రెండు వారాల్లోనే బ్రేక్ చేసింది.    ఈ రికార్డును బద్దలు కొట్టే సమయంలో తాను చాలా ఉద్విగ్నతకు గురయ్యానని లియా చెప్పింది. ఒకేసారి చాలా బీన్స్ తినడం చాలా కష్టం. అదే సమయంలో, అల్పాహారం హోస్ట్ చేసే కేఫ్ యజమాని అలీ క్లిఫ్టన్ మాట్లాడుతూ.. తాను లియా ఆహారం తినే వేగాన్ని చూసి  ఆశ్చర్యపోయానని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..