Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tennis Player: ఈ టెన్నిస్ ప్లేయర్ జీవితంలో ప్లేబాయ్.. 2500 మంది మహిళలతో ఎఫైర్.. 72ఏళ్లకి 30 ఏళ్ల చిన్నదైన యువతితో పెళ్లి

రొమేనియాకు చెందిన ఇలీ మాట్లాడుతూ.. నేను మహిళలను చాలా ఇష్టపడ్డాను. నేను ప్రేమించడం చాలా సాధారణం అని చెప్పారు

Tennis Player: ఈ టెన్నిస్ ప్లేయర్ జీవితంలో ప్లేబాయ్.. 2500 మంది మహిళలతో ఎఫైర్.. 72ఏళ్లకి 30 ఏళ్ల చిన్నదైన యువతితో పెళ్లి
Tennis Player Ilie Nastase
Follow us
Surya Kala

|

Updated on: Jul 01, 2022 | 11:43 AM

Tennis Player: ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ విలాసవంతమైన జీవనశైలిని గడపడానికి ఇష్టపడతారు. అయితే విలాసవంతమైన జీవితాన్ని మాత్రం అత్యంత ధనవంతులు, సెలబ్రెటీలు అంటే.. క్రీడాకారులు, ఫేమస్ నటీనటులు మాత్రమే ఈ అభిరుచిని నెరవేర్చకోగలరు. ఈ రోజు మనం అలాంటి ఆటగాడి ఓ క్రీడారుడి గురించి తెలుసుకుందాం.. అతని జీవితంలో రెండున్నర వేలకు పైగా మహిళలతో (2500 మంది స్త్రీల ప్రేమ వ్యవహారం) సంబంధాలు ఉన్నాయని టాక్. ఇదే విషయ ప్రస్తావన అతని ఆత్మకథలో ఉంది. అయితే కొన్నాళ్ల తర్వాత.. ఆ క్రీడాకారుడిని మహిళలపై సంబంధాల గురించి ప్రశ్నించినప్పుడు.. అతను ఇలా సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విన్న తర్వాత  ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. మరి ఆ ఫేమస్ క్రీడాకారుడు ఎవరు.. అతని ఆన్సర్ ఏమిటో తెలుసుకుందాం..

రొమేనియాకు చెందిన ఇలీ నాస్టాస్ గొప్ప టెన్నిస్ క్రీడాకారుడు. ఈ ఆటగాడు తన ఆటతో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలవడమే కాదు..  తన జీవితాన్ని ప్లేబాయ్ లా జీవించాడు. ఎందుకంటే అతను తాను పెళ్లి చేసుకోవడానికి ముందు సుమారు  2,500 మంది అమ్మాయిలతో సంబంధాలు కలిగి ఉన్నానని అతను ఒకప్పుడు పేర్కొన్నాడు.. అయితే కొన్నాళ్ల తర్వాత.. ఇదే విషయం డైలీ మెయిల్‌తో ప్రస్తావిస్తూ.. ఈ సంఖ్యను తక్కువగా చేసి చెప్పాడు.

‘నా జీవితంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు’ ఇలీ మాట్లాడుతూ.. నేను మహిళలను చాలా ఇష్టపడ్డాను. నేను ప్రేమించడం చాలా సాధారణం అని చెప్పారు. అంతేకాదు 2500 మంది అమ్మాయిలతో రొమాన్స్ గురించి మాట్లాడుతూ.. నా ఆత్మకథలో ఈ విషయాన్ని అతిశయోక్తి చేసి పుస్తకాల అమ్మకాలు పెరిగేలా చేశారని చెప్పాడు. కరెక్ట్ ఫిగర్ గురించి ఆసక్తికర సమాధానమిచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇది ఒక పనికిరాని విషయమని.. నేను ఎంతమంది అమ్మాయిలను ఇష్టపడ్డానో నాకు తెలియదు. వారి సంఖ్య 300, 400 అనేది నేను ఎప్పుడూ లెక్కించలేదు. అయినా ఇప్పుడు అది ఏమీ మారదు.. నేను ఇష్టపడిన అమ్మాయిల సంఖ్య  500 లేక 2500 అయినా దానికి నాకు ఎటువంటి పతకం ఇవ్వరు.. అయితే నా జీవితంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని నేను ఖచ్చితంగా చెబుతానని అన్నారు ఇలీ.

ఇలీ నాస్టాస్ చాలామంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారని.. అతని మూడవ భార్య.. రొమేనియన్ మోడల్ అమాలియా టియోడోస్కు  వద్ద ప్రస్తావించగా.. ఆమె షాకింగ్ సమాధానం చెప్పింది. అటువంటి రొమాంటింక్ వ్యక్తి భర్తగా వచ్చినందుకు సంతోష పడినట్లు చెప్పింది.  పెళ్లయిన ఆరేళ్ల తర్వాత 2010లో అమాలియా స్వయంగా ఇలీ నాస్టాస్ నుంచి విడిపోయింది. అనంతరం ఇల్లీ 2013లో రొమేనియన్ ఫ్యాషన్ మోడల్ బ్రిగిట్టే ఎస్ఫాట్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి కూడా ఐదు సంవత్సరాల కాపురం తర్వత  పెటాకులయింది. అనంతరం 72 సంవత్సరాల వయస్సులో.. ఇలీ నాస్టాస్ తన కంటే 30 సంవత్సరాలు చిన్నదైన ఐయోనా సిమియోన్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..