Masafumi Nagasaki: ద్వీపంలో 30 ఏళ్లుగా నగ్నంగా ఒంటరి జీవితం.. ఆ వృద్ధుడి ఆలోచన వెనుక రీజన్ ఏమిటంటే..

80 ఏళ్ళు వచ్చాయి.. అడవుల్లో ఉంటె.. మరణిస్తావు అంటూ.. ఎలాగైతే.. కరోనా సమయంలో జనావాసాల మధ్యకు తీసుకుని వచ్చారు.. అయితే ప్రశాంత వాతావరణం నుంచి వచ్చిన అతను కార్లు, బస్సుల రణగొణ ధ్వనులను, కలుషిత సమాజాన్ని భరించలేకపోయాడు

Masafumi Nagasaki:  ద్వీపంలో 30 ఏళ్లుగా నగ్నంగా ఒంటరి జీవితం..  ఆ వృద్ధుడి ఆలోచన వెనుక రీజన్ ఏమిటంటే..
Japanese Cast Away Man
Surya Kala

|

Jun 30, 2022 | 10:20 AM

Masafumi Nagasaki: ఉరుకులు పరుగుల జీవితం.. రణగొణ ధ్వనుల మధ్య విసుగు చెందిన మనసు.. ఒక్కొక్కసారి.. అందరికి దూరంగా ఏ అడవులకైనా వెళ్లి.. ప్రశాంతంగా జీవించాలని భావించేవారు చాలామంది ఉండి ఉంటారు.. అయితే కుటుంబ సభ్యుల మధ్యకు చేరుకోగానే.. విసుగు పోయి.. మళ్ళీ రొటీన్ పనిలో పడిపోతుంది మనసు.. కానీ ఓ మాత్రం అందుకు విరుద్ధం.. నాకు పట్టణ జీవితం వద్దంటూ.. కాకులు దూరని అడవిలో ఒకటి కాదు.. రెండు కాదు..సుమారుగా 30ఏళ్లుగా జీవిస్తున్నాడు. అచ్చంగా ఆదిమానవుడిగా ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా అడవిలో బతికాడు.. 80 ఏళ్ళు వచ్చాయి.. అడవుల్లో ఉంటె.. మరణిస్తావు అంటూ.. ఎలాగైతే.. కరోనా సమయంలో జనావాసాల మధ్యకు తీసుకుని వచ్చారు.. అయితే ప్రశాంత వాతావరణం నుంచి వచ్చిన అతను  కార్లు, బస్సుల రణగొణ ధ్వనులను, కలుషిత సమాజాన్ని భరించలేకపోయాడు. మళ్లీ తన ద్వీపానికి పోతానన్నాడు.. దీంతో అధికారులు చేసేది ఏమీ లేక మళ్ళీ అడవుల్లో వదిలి పెట్టారు. జపాన్ కు చెందిన ఈ వ్యక్తిని నగ్న సన్యాసి అని అంటారు. వివరాల్లోకి వెళ్తే..

జపాన్‌కు చెందిన 87 ఏళ్ల ముసఫూమీ నాగసాకి మూడు దశాబ్దాల కిందట ఓ ద్వీపానికి వెళ్లిపోయాడు. ఆ ఉష్ణమండల ద్వీపంలో ఒంటరిగా గడిపాడు . ఇంట్లో వాళ్లు మొదట అందుకు ఒప్పుకోకపోయినా అతని పట్టదల చూసి కాదనలేకపోయాడు. ‘చావైనా బతుకైనా అక్కడే’ అని నాగసాకి బైబై చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత ద్వీపంలో ఆదిమానవుడిలా బతికేశాడు. నాగసాకి తన యాభైలలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నప్పుడు నాగరికతతో విసిగిపోయాడు. 1989లో, అతను తన భార్య,  ఇద్దరు పుకారు పిల్లలను విడిచిపెట్టి, జపాన్ ప్రధాన భూభాగానికి దక్షిణంగా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచినీరు కూడా లేని సోటోబనారి అనే ద్వీపానికి ఒంటరిగా చేరుకున్నాడు.

రిమోట్ ద్వీపం దట్టంగా వృక్షసంపదతో ఉంది. జనసాంద్రత లేదు. ఈ ద్వీపంలో నాగసాకి మాత్రమే నివాసి.
నాగసాకి ద్వీపాన్నే తన నివాసం చేసుకుని ఇంటికి తిరిగి రాలేదు. సోటోబనారీని తన కొత్త ఇంటిగా మార్చుకున్నాడు. గత  29 సంవత్సరాలు అక్కడ ఒంటరిగా నివసించాడు. అగ్గిపెల్టె, కొవ్వొత్తులు, ఉప్పు వంటి వాటిని దగ్గర్లోని మరో ద్వీపానికి వెళ్లి కొనుక్కుని మళ్లీ తన ద్వీపానికి వచ్చేవాడు. అవి కొనుక్కోడానికి కుటుంబసభ్యులు డబ్బుల పంపేవాళ్లు.

2018లో బీచ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని స్థానిక మత్స్యకారుడు గుర్తించడంతో అతన్ని ద్వీపం నుండి తరలించారు. అతని ఆరోగ్యం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స అవసరమని చెప్పడంతో నాగసాకి పట్టణానికి తిరిగి తీసుకుని వచ్చారు. ఆ సమయంలోనే అతని కథ ప్రపంచానికి తెలిసింది.

ఇంతలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. ఎక్కడికి కదల లేక.. ఇషిగాకి నగరంలో నాలుగు సంవత్సరాలు నివసించాల్సి వచ్చింది. మళ్ళీ  తాను ద్వీపం పిలుస్తోంది.. వెళ్ళిపోతా అంటూ కొత్త పాట అందుకున్నాడు. కన్నీళ్లతో కాళ్లావేళ్లా పడ్డంతో అధికారులు కాళ్ళు పట్టుకున్నాడు. అధికారులు నచ్చ చెప్పినా వినకపోవడంతో.. సరేనని ఒప్పుకున్నారు. జూన్ 16న నాగసాకి మళ్లీ ఒంటరి అడవిలో వదిలేశారు.

అయితే తాము నాగసాకిని తాత్కాలికంగానే పంపామని.. కొన్నాళ్లు అక్కడే ఉంచి ద్వీపానికి ‘ఫేర్ వెల్’ చెప్పించాక మళ్లీ తీసుకుని వచ్చేస్తామని అధికారులు చెబుతున్నారు. అతని ఆరోగ్యం బాగాలేదని, మానసిక ప్రశాంతత కోసం అలా టూరుకు పంపినట్లు పంపామంటున్నారు. ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన నాగసాకి వీడియో పలువురు హృదయాలను కదిలించింది

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu