Bus Accident: మరో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణీకులు!
బస్సు టైర్లు పగిలిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిసింది. టైరు పగిలి బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఈ ప్రమాదంలో
Gujarat Bus Accident: గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డాంగ్ జిల్లాలోని సపుతారా సమీపంలో ప్రయాణీకుల బస్సు కాలువలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. జరిగిన ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు టైర్లు పగిలిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిసింది. టైరు పగిలి బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలిసింది. చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు కూడా తెలిసింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
ప్రమాదానికి గురైన బస్సు సూరత్ నుంచి మహారాష్ట్రలోని మాలెగావ్‌కు వెళ్తోందని చెబుతున్నారు. ప్రయాణ సమయంలోనే డాంగ్ జిల్లాలోని సపుతారా సమీపంలోని కాలువలో పడిపోయింది. బస్సులో ఉన్న 50 మంది సూరత్ వాసులుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు మరణించారని డీఎస్పీ రవిరాజ్ సింగ్ జడేజా టీవీ9తో మాట్లాడుతూ తెలిపారు. అయితే, మృతుతల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. గాయపడిన వారికి సపుతర, సంఘన్‌లో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు.
గుజరాత్ క్యాబినెట్ మంత్రి పూర్ణేష్ మోడీ ఈ సంఘటన గురించి వాట్సాప్ సందేశంలో తెలియజేశారు. దీనితో పాటు ఈ రహదారి చుట్టూ ఉన్న రహదారి నిర్మాణ కార్మికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆదుకోవాలని ఆయన అభ్యర్థించారు. అయితే, సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక యంత్రాంగం అక్కడకు చేరుకుంది. ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు.
డాంగ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి నీరు చేరింది గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో పచ్చదనం పెరగడంతో పాటు రోడ్లపై కూడా నీరు చేరుతోంది. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు రహదారులు మూసుకుపోవడంతో పాటు పలుచోట్ల కొండలపై నుంచి రాళ్లు రోడ్లపై పడ్డాయి. అటువంటి పరిస్థితిలో, రోడ్లు కూడా బ్లాక్ చేయబడ్డాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి