AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు అప్పులకు, అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది, విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు.. మరీ మీదే రాశి..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారిని అసంతృప్తి, నిరాశ వెంటాడుతాయి. మరికొన్ని రాశుల వారికి అంతా సంతోషకరంగా సాగుతుంది. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి..

Horoscope Today: ఈ రాశివారు అప్పులకు, అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది, విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు.. మరీ మీదే రాశి..?
Horoscope Today
Jyothi Gadda
|

Updated on: Jul 10, 2022 | 7:41 AM

Share

Horoscope Today 10 July 2022: పంచాంగం ప్రకారం.. ఈరోజు అంటే.. జూలై 10, 2022 ఆదివారం.. ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి, శుభ యోగం..ఈ రోజు చంద్రుడు వృశ్చికరాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్రం విశాఖ నక్షత్రం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారిని అసంతృప్తి, నిరాశ వెంటాడుతాయి. మరికొన్ని రాశుల వారికి అంతా సంతోషకరంగా సాగుతుంది. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం మొదలు పెట్టే పనిలో విజయం సాధిస్తారు..ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

వృషభం శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.

ఇవి కూడా చదవండి

మిథునం ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.

కర్కాటకం ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. అవగాహనా లోపం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. బంధు,మిత్రులతో వాగ్వాదాలకు దిగవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించక తప్పదు.

సింహం మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి.

కన్య ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. మంచి ఫలితాలు ఉన్నాయి.

తుల స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. పరిశుభత్రకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు.

వృశ్చికం మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగిఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయం సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.

ధనుస్సు అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు.

మకరం కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.

కుంభం తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్యబాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

మీనం వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..