Chaturmas 2022: చాతుర్మాస కాలంలో ఈ 5 రాశుల వారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం.. అందులో మీరున్నారా..

Chaturmas 2022: ఈరోజు తొలి ఏకాదశిపర్వదినం. అంతేకాదు ఈరోజు (జూలై 10వ తేదీ) నుంచి చాతుర్మాసం కూడా ప్రారంభంకానుంది. ఈరోజు  విష్ణువు యోగ నిద్రలోకి  వెళ్లనున్నాడని నమ్మకం. ఈ నేపథ్యంలో ఏ రాశుల వారికి చాతుర్మాస కాలం ఫలప్రదం అవుతుందో తెలుసుకుందాం.

Chaturmas 2022: చాతుర్మాస కాలంలో ఈ 5 రాశుల వారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం.. అందులో మీరున్నారా..
Chaturmas 2022
Follow us
Surya Kala

|

Updated on: Jul 10, 2022 | 5:12 PM

Chaturmas 2022: ఈరోజు ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం.. దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని అంటారు. ఈరోజు ఉపవాసం చేస్తారు. ఈ ఏకాదశి నుండి దేవతని ఏకాదశి వరకు..  విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడని నమ్ముతారు. దీనినే చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలను జరుపుకోరు. ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..  ఈసారి చాతుర్మాసంలో ఈ  5 రాశుల వారికి చాలా ఫలప్రదం అవుతుంది. ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీరు వృత్తి, వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఏయే రాశులకు  అదృష్ట యోగాన్ని తెస్తుందో తెలుసుకుందాం.

మేషరాశి: మేష రాశి వారికి ఈ 4 నెలలు చాలా ఫలవంతంగా ఉంటాయి. ఈ రాశుల వారికి ఈ నెలల కాలం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. కొత్త అవకాశాలతో సంపద మరింత పెరుగుతుంది.  మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై నిలిచి ఉంటుంది.

కన్య రాశి: కన్యా రాశి వారికి ఈ 4 నెలల కాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఈ రాశివారు విద్యా రంగంతో అనుబంధం కలిగి ఉన్నట్లయితే.. ఈ సమయం చాలా మంచిది.

సింహరాశి: సింహ రాశి వారు ఈ కాలంలో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఈ రాశివారిపై ఉంటాయి. మీరు ఈ సమయంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే.. ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

మిథున రాశి: మిథున రాశి వారికి ఈ కాలంలో ధనలాభం కలుగుతుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశివారిపై నిలిచి ఉంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు చాతుర్మాస సమయంలో వ్యాపారాన్ని విస్తరించగలరు. ఎక్కువ శ్రమ పడకుండానే పనుల్లో సక్సెస్ అందుకుంటారు. ఈ రాశి వారిపై మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే