- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti in Telugu: Never fight with these people or else you will regret later
Chanakya Niti: ఈ ముగ్గురు వ్యక్తులతో ఎప్పుడూ గొడవ పడకండి.. పశ్చాతాపమే తప్ప ఫలితం ఉండదంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.
Updated on: Jul 10, 2022 | 7:23 PM

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యువత తప్పు సాంగత్యానికి దూరంగా ఉండాలి. చెడు అలవాట్లు, వ్యసనాల వారి మధ్య కూర్చోవడం వల్ల అవతలి వారికీ చెడు అలవాట్లు ఖచ్చితంగా వస్తాయి. దీని కారణంగా యువత తన లక్ష్యాన్ని సాధించలేదు.

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యుక్తవయస్సులో.. యువతీయువకులు భవిష్యత్తు గురించి అప్రమత్తంగా ఉండాలి. సరైన వ్యూహాన్ని రూపొందించడం ద్వారా, యువత తమ జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు. అయితే వారు చెడు అలవాట్లకు బానిసగా మారితే అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువతీయువకులు ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం

కోడి పుంజు - సూర్యోదయానికి ముందే కోడిపుంజు లేస్తుంది. అంతేకాదు వ్యతిరేకశక్తులపై పోరాడుతుంది. ఆహారాన్ని పంచుకోవడం, మీ స్వంత శక్తితో ఆహారం పొందడం. ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తి కోడి నుండి నేర్చుకోవచ్చు. ఈ లక్షణాలు మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి.

మత్తు వంటి అలవాటుకు యువత దూరంగా ఉండాలి. మత్తు కారణంగా మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుడవుతాడు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యసనాలు యువత వర్తమానాన్ని, భవిష్యత్తును పాడుచేస్తాయి.

ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి తన గురువుతో ఎప్పుడూ వాదన చేయకూడదు. మన గురువు మనలను అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తారు. గురువుతో కలహించడం వలన మిమ్మల్ని మీరు గురువు నుండి దూరం చేసుకోవడమే.. అంతేకాదు మీరు జ్ఞానానికి కూడా దూరం అవుతారు. కాబట్టి మీ గురువుతో ఎప్పుడూ గొడవ పడకండి.





























