AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇతని డ్రైవింగ్ చూస్తే నొరెళ్లబెట్టాల్సిందే.. రన్నింగ్ బైక్ వదిలేసి దర్జాగా ఫోన్ మాట్లాడుతున్నాడు.. చివరకు..

సాధారణంగానే రోడ్డుపై వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్‌ఫోన్లు వాడరాదని పోలీసులు తరచూ హెచ్చరిస్తూనే ఉంటారు. అలా చేసిన వారిపట్ల ట్రాఫిక్‌ పోలీసులు కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తుంటారు.

Viral Video: ఇతని డ్రైవింగ్ చూస్తే నొరెళ్లబెట్టాల్సిందే.. రన్నింగ్ బైక్ వదిలేసి దర్జాగా ఫోన్ మాట్లాడుతున్నాడు.. చివరకు..
Handle Clip
Jyothi Gadda
|

Updated on: Jul 10, 2022 | 9:55 AM

Share

Viral Video: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మరికొన్ని వీడియోలు చూస్తే మన కళ్లనే మనం నమ్మలేని పరిస్థితి ఎదురవుతుంది. అయితే, కొంతమంది మాత్రం తమను తాము నిరూపించుకోవటం కోసం పలురకాల స్టంట్స్ చేస్తుంటారు..తాజాగా అలాంటిదే ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియోలో ఒక సర్దార్ జీ బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న స్టైల్ చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అదేం డ్రైవింగ్‌ రా బాబు.. ఏ మాత్రం భయంలేదు..అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…

సాధారణంగానే రోడ్డుపై వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్‌ఫోన్లు వాడరాదని పోలీసులు తరచూ హెచ్చరిస్తూనే ఉంటారు. అలా చేసిన వారిపట్ల ట్రాఫిక్‌ పోలీసులు కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తుంటారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, ఫోన్‌ చూస్తూ డ్రైవ్‌ చేసేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు, ట్రాఫిక్‌ సిబ్బంది ఎప్పటికప్పుడూ హెచ్చరిస్తునే ఉంటారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు తమ విధానం మార్చుకోరు. సోషల్ మీడియా లైకులు, షేర్ల కోసం పదే పదే అలాంటి స్టంట్స్‌ చేస్తూనే ఉంటారు. తాజాగా ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలాంటి పనే చేశాడు.. రోడ్డుపై బైక్‌ డ్రైవ్‌ చేస్తూ..బైక్‌ హ్యాండిల్ విడిచిపెట్టాడు. అంతేకాదు..బైక్‌పై వన్‌సైడ్‌ కూర్చుని, కాలుమీద కాలు వేసుకుని సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బైక్‌ డ్రైవ్‌ చేస్తున్నాడు..ఇన్‌స్టా వేదికగా ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనం అవాక్కై చూస్తున్నారు. ఇదేం డ్రైవింగ్‌ రా బాబు.. అంటూ భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. కిందపడిపోతానేమోననే భయం అతనిలో ఏ మాత్రం కనిపించటం లేదు..ఇక కొందరు మాత్రం అతడి బైక్‌ను దెయ్యం కంట్రోల్‌ చేస్తుందేమో అంటూ ఫన్నీ కామెంట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ క్లిప్‌ను రియల్‌కరంచావ్లా_ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వార్త రాసే సమయానికి 18 లక్షల మందికి పైగా లైక్ చేశారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ఒక వినియోగదారు, ‘సర్దార్ జీ చలాన్‌ని నేరుగా యమ్‌రాజ్ తీసివేస్తారు’ అని రాశారు. మరొక వినియోగదారు, ‘డ్రైవర్‌ని ఎడిటింగ్‌లో అదృశ్యం చేశారంటూ కామెంట్‌ చేశారు. ఇంకా చాలా మంది దీనిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలుసుకుంటే నోరెళ్లబెడతారు..షాకింగ్
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలుసుకుంటే నోరెళ్లబెడతారు..షాకింగ్
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే
సైకో భార్య.. భర్తను చంపేసి.. ఆ వీడియోలు చూస్తూ రాత్రంతా..
సైకో భార్య.. భర్తను చంపేసి.. ఆ వీడియోలు చూస్తూ రాత్రంతా..