Flight Attendant : అత్యంత ఎక్కువకాలం పనిచేసిన ఎయిర్‌హోస్టెస్‌గా.. గిన్నిస్‌ రికార్డ్‌లోకి..

Flight Attendant : అత్యంత ఎక్కువకాలం పనిచేసిన ఎయిర్‌హోస్టెస్‌గా.. గిన్నిస్‌ రికార్డ్‌లోకి..

Anil kumar poka

|

Updated on: Jul 10, 2022 | 9:59 AM

65 ఏళ్లుగా ఒకే సంస్థలో, ఒకే రూట్‌లో సేవలందిస్తూ... అత్యంత ఎక్కువకాలం పనిచేసిన ఎయిర్‌హోస్టెస్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిందో మహిళ. అమెరికాలో బెట్‌ నాష్‌కు ఇప్పుడు 86 ఏళ్లు.


65 ఏళ్లుగా ఒకే సంస్థలో, ఒకే రూట్‌లో సేవలందిస్తూ… అత్యంత ఎక్కువకాలం పనిచేసిన ఎయిర్‌హోస్టెస్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిందో మహిళ. అమెరికాలో బెట్‌ నాష్‌కు ఇప్పుడు 86 ఏళ్లు. 1957లో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. ఆరున్నర దశాబ్దాలుగా న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్‌ డీసీ వయా బోస్టన్‌ రూట్‌లోనే సేవలందిస్తోంది. ప్రయాణికుల పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తించే బెట్‌… తరచుగా ఆ మార్గంలో ప్రయాణించే ఎంతోమందికి అభిమాన ఎయిర్‌హోస్టెస్‌గానూ మారిపోయింది.వేరే మార్గాన్ని ఎంచుకునే అవకాశమున్నా ఆమె ఆ రూట్‌లోనే పనిచేయడానికో కారణం ఉంది. అది ఆమె కొడుకు. వైకల్యంతో బాధపడుతున్న అతడికి తల్లి అవసరం ఎంతో ఉంది. ఇక ఆ రూట్‌ అయితే రాత్రికల్లా ఇంటికి చేరుకుని కొడుకును చూసుకునే సౌలభ్యం ఉంది. ఇన్నేళ్లుగా ఇటు ఉద్యోగాన్ని, అటు కొడుకు బాధ్యతలను అవిశ్రాంతంగా కొనసాగిస్తోంది. ఒకే కంపెనీలో 84 ఏళ్లుగా సేవలందిస్తున్న వ్యక్తిగా ఇటీవలే వందేళ్ల వయసున్న బ్రెజిల్‌కు వ్యక్తి వాల్టేర్‌ ఆర్థ్‌మన్‌ రికార్డు సాధించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 10, 2022 09:59 AM