Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Population Day 2022: మరో ఏడాది కాలంలో ఆ విషయంలో చైనాను అధిగమించనున్న భారత్..

దశాబ్ధాలుగా ప్రపంచ జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో? అధిక జనాభా కారణంగా ఎదురయ్యే సమస్యలు ఏమిటో?, పర్యవరణంపై జనాభా ప్రభావం వంటి ఇతర సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతీయేట జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం (World population day) జరుపుకుంటున్నాం. దీనిలో..

World Population Day 2022: మరో ఏడాది కాలంలో ఆ విషయంలో చైనాను అధిగమించనున్న భారత్..
World Population Day
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 11, 2022 | 3:15 PM

World Population Day 2022: దశాబ్ధాలుగా ప్రపంచ జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో? అధిక జనాభా కారణంగా ఎదురయ్యే సమస్యలు ఏమిటో?, పర్యావరణంపై జనాభా ప్రభావం వంటి ఇతర సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతీయేట జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం (World population day) జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, ప్రసూతి ఆరోగ్యం, మానవ హక్కులు వంటి వివిధ జనాభా సమస్యలపై పాఠశాలలు, కాలేజీల్లో అవగాహణ కల్పించేందుకు ప్రతీ యేట సెమినార్లు, వ్యాసరచన పోటీలు, సమావేశాలను కూడా నిర్వహిస్తారు. ఫలితంగా జనాభా సమస్యలపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కలుగుతుంది.

ప్రపంచ జనాభా దినోత్సవం 2022 థీమ్ ఏంటంటే.. ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఒక్కో ప్రత్యేక థీమ్‌ను పాటించడం జరుగుతుంది. ఈ ఏడాది (2022) థీమ్‌ ఏంటంటే.. ‘8 బిలియన్ల ప్రపంచం (A world of 8 billion): స్థితిస్థాపక భవిష్యత్తు వైపు అందకి పయనం, అవకాశాలను అందిపుచ్చుకోవటం, హక్కులు, ఎంపికలను స్థిరపరచుకోవడం’ .

2100 నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుకుంటుందంటే.. ప్రపంచ జనాభా 1 బిలియన్‌కు పెరగడానికి వందల వేల సంవత్సరాలు పట్టింది. 200 ఏళ్లలో జనాభా ఏడు రెట్లు పెరిగింది. 2011లో ప్రపంచ జనాభా 7 బిలియన్ల మార్కుకు చేరుకోగా.. 2021 నాటికి దాదాపు 7.9 బిలియన్లకు (దాదాపు 800ల కోట్లు) జనాభా పెరిగింది. 2030లో దాదాపు 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు, 2100లో 10.9 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.

ఇవి కూడా చదవండి

ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పటి నుంచి ప్రారంభమైంది.. జూలై 11, 1989 నుంచి వరల్డ్‌ పాపులేషన్‌ డే జరుపుకోవడం ప్రారంభమైంది. ఆ లెక్కన ఏ ఏడాది 2022 33వ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1989లో ఐక్యరాజ్యసమితి పాలక మండలి దీనిని ఏర్పాటు చేసింది. జూలై 11, 1987 నాటికి ప్రపంచ జనాభా ఐదు బిలియన్ల మందికి చేరుకుంది. ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు పైగా పెరుగుతున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి దీనిని ఏర్పాటు చేసింది.

ప్రముఖులు ఏమంటున్నారు..

  • ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారిలో పేదరికంలో ఉన్నవారే ఎక్కువ. మానవ అభివృద్ధిలో ఇటువంటి అసమానతలు అశాంతికి, హింసకు గల ప్రధాన కారణాల్లో ఒకటి- A PJ అబ్దుల్ కలాం
  • మహిళా నాయకురాలిగా భిన్నమైన నాయకత్వాన్ని తీసుకువచ్చాను. మహిళల సమస్యలపై నాకు ఆసక్తి ఉంది. ఓ మహిళగా, తల్లిగా జనాభా పెరుగుదల రేటును తగ్గించడానికి, భిన్న కోణంతో రాజకీయాల్లో అడుగుపెట్టాను” -బెనజీర్ భుట్టో (పాకిస్థాన్‌ మాజీ ప్రధాని)
  • వేగవంతమైన జనాభా పెరుగుదల సాంకేతిక ఆవిష్కరణలు, సామాజిక వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయనే దానిపై అవగాహన లేకపోవడంతో గందరగోళాన్ని సృష్టించాయి -డేవిడ్ సుజుకి
  • కుటుంబం చిన్నదిగా ఉంటే, వారి వద్ద కొంచెం ఉన్నా పంచుకోగలుగుతారు. అక్కడ శాంతి కూడా ఉంటుంది -ఫిలిప్ జుగుణ
  • ప్రపంచ జనాభా ఎంతటి భయానక స్థాయిలో విస్తరిస్తుందో, నమ్మశక్యంగా ఉండదు – బిండి ఇర్విన్
  • పర్యావరణ నష్టానికి జనాభా పెరుగుదల ప్రాథమిక కారణం -జాక్వెస్ వైవ్స్ కూస్టియో

2022లో 1.4 బిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన దేశాలుగా చైనా, భారతదేశం ముందు వరుసలో ఉన్నాయి. ఇక 2023 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ చైనాను అధిగమిస్తుందని అంచనా.