- Telugu News Photo Gallery Skin Care Tips in telugu: Know why it is important to wash the face before sleeping at night? know these amazing benefits
Skin Care Tips: రాత్రి నిద్రపోయే ముందు ముఖం కడుక్కుంటే ఎన్ని లాభాలో.. ముడతలు మాయం ఇంకా..
ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు చర్మ సంబంధిత సమస్యల నుంచి రక్షణ పొందాలంటే మరింత జాగ్రత్త అవసరం. రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం. ఇది మీ చర్మ రంధ్రాలను తెరచుకుని, చర్మం శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది..
Updated on: Jul 11, 2022 | 5:06 PM

ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు చర్మ సంబంధిత సమస్యల నుంచి రక్షణ పొందాలంటే మరింత జాగ్రత్త అవసరం. రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం. ఇది మీ చర్మ రంధ్రాలను తెరచుకుని, చర్మం శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. రాత్రిపూట ముఖం కడుక్కోవడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

రాత్రి పూట ముఖం కడుక్కోకపోవడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. తేలికపాటి క్లెన్సర్‌తో రాత్రి పడుకునే ముందు ముఖాన్ని కడుక్కోవడం వల్ల రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. దీంతో మొటిమల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

సూర్యరశ్మి, దుమ్ము, కాలుష్యం కారణంగా చర్మంపై ట్యాన్ పేరుకుపోతుంది. ఇటువంటివారు రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కోవడం వల్ల చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి పనిచేస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.

రాత్రిపూట ముఖం కడుక్కోవడం వల్ల ముడతలు తగ్గుతాయి. ముఖంపై ఉండే ఫ్రీ రాడికల్స్ మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల ఫైన్ లైన్స్, ముడతల సమస్యలు పెరుగుతాయి.

రాత్రి పూట ముఖం కడుక్కోకపోతే చర్మంపై మురికి అలాగే ఉండి, రిపేర్ చేయడానికి వీలుండదు. ఇది తర్వాత చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి రాత్రి పూట ముఖం కడుక్కున్న తర్వాత నిద్రించడం చాలా అవసరం.




