- Telugu News Photo Gallery Monsoon Health Tips: Drink these types of healthy tea to get rid of cold cough problem in monsoon
Monsoon Health Tips: వర్షాకాలంలో జలుబు, దగ్గు సమస్యలకు చెక్ పెట్టేందుకు.. ఈ టీల్లో ఏదోకటి ఎంచుకోండి..
Monsoon Health Tips: వర్షాకాలంలో ఉష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు చల్లగా ఉంటుంది. కొన్నిసార్లు వేడిగా ఉంటుంది. దీంతో శరీర ఉష్ణోగ్రతలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు జలుబు, ఫ్లూ బారిన పడతారు. వర్షంలో ఈ టీలు తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Updated on: Jul 11, 2022 | 4:03 PM

వర్షాకాలంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. ఉష్ణోగ్రతలో మార్పులతో శరీరం వ్యాధుల బారినపడుతుంది. మీరు అలాంటి సమస్యను నివారించాలనుకుంటే.. ప్రతిరోజూ ఈ టీలలో ఏదొక దాన్ని త్రాగండి.

సొంఠి టీ: మీరు మార్కెట్‌లో ఔషధ గుణాలు కలిగిన ఈ రకమైన అల్లం పొడిని సులభంగా ఖరీదు చేయవచ్చు. ఈ టీ ని తయారు చేసుకునే సమయంలో మరుగుతున్న నీటిలో కొత్తిమీర గింజలు, పేపర్ కార్న్స్, జీలకర్ర పొడి, చక్కెరను ఉపయోగించండి. ఈ హెల్తీ టీని ఉదయాన్నే తాగండి.

తులసి గింజల టీ: జలుబు, కఫ సమస్య నుంచి బయటపడేందుకు తులసిని చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. వర్షంలో తులసి ఆకులు లేదా తులసి గింజలు వేసుకుని పాల టీ లేదా బ్లాక్ టీ తాగవచ్చు. ఈ టీ మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు బారిన పడకుండా చేస్తుంది.

ములేతి టీ: గొంతు నొప్పికి చికిత్స నివారణకు బెస్ట్ టీ ములేతి టీ. లికోరైస్ అని కూడా అంటారు. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి. ఈ టీని పాలు లేకుండా తయారు చేసుకోవచ్చు, వర్షాకాలంలో ప్రతిరోజూ తాగవచ్చు.

చామంతి టీ: ఇది ఒక రకమైన హెర్బల్ టీ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ తాగుతారు. విశేషమేమిటంటే ప్రస్తుతం మార్కెట్‌లో సులువుగా దొరుకుతోంది. చామంతి టీ తాగడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలను మీ నుండి దూరంగా ఉంచుతుంది.




