TCS share price: భారీగా పతనమైన టీసీఎస్ షేర్లు! క్యూ1 ఫలితాల్లో 4.8 శాతానికి పడిపోయిన..

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్ ధరలు జూలై 11 ( సోమవారం) నాటికి 4.8 శాతానికి తగ్గి మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి..

TCS share price: భారీగా పతనమైన టీసీఎస్ షేర్లు! క్యూ1 ఫలితాల్లో 4.8 శాతానికి పడిపోయిన..
Tcs
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 11, 2022 | 4:27 PM

TCS Q1 Result 2022: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్ ధరలు జూలై 11 ( సోమవారం) నాటికి 4.8 శాతానికి తగ్గి మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి. దీంతో టీసీఎస్ షేర్లు భారీగా పతనమయ్యి రూ. 3,111కి చేరుకున్నాయి. ఔట్ లుక్‌ ఖర్చుల కారణంగా మొదటి త్రైమాసికంలో బీఎస్ఈ షేర్లు పడిపోయాయి. ఇక ఎన్‌ఈస్ఈలో ఇది 4.76 శాతం క్షీణించి రూ.3,110కి చేరుకుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ (mcap) రూ.54,830.89 కోట్లు తగ్గి రూ.11,39,794.50 కోట్లకు చేరుకుంది. దేశంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుగా పేరుగాంచిన టీసీఎస్ జూన్ త్రైమాసికంలో 5.2 శాతం పెరిగి రూ.9,478 కోట్ల నికర లాభాన్ని అందుకుంది. వార్షిక వేతనాల పెంపుదల, ప్రమోషన్‌ల ప్రభావంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్‌లను బహుళ-త్రైమాసిక కనిష్ట స్థాయికి తీసుకువెళ్లింది. తాజా క్యూ1 ఫలితాల్లో ఈ మేరకు షేర్లు పతనమయ్యినట్లు తెలుస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి.