- Telugu News Photo Gallery Health Benefits Of Garlic: Why you should eat garlic empty stomach? heres reason
Health Benefits of Garlic: రోజూ పరగడుపున వెల్లుల్లి తింటున్నారా? క్యాన్సర్‌తోసహా..
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పలుమార్గాలను అవలంభిస్తున్నారు. వంటింట్లో దొరికే వెల్లుల్లిని ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల ఇమ్యునిటీ బలం పుంజుకోవడంతోపాటు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం..
Updated on: Jul 20, 2022 | 7:45 AM

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పలుమార్గాలను అవలంభిస్తున్నారు. వంటింట్లో దొరికే వెల్లుల్లిని ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల ఇమ్యునిటీ బలం పుంజుకోవడంతోపాటు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం..

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో బి6, సి విటమిన్లు, ఫైబర్, మాంగనీస్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలున్నాయి. శరీరంలో అదనపు కొవ్వులను తగ్గించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, క్రిమినాశక లక్షణాలు కూడా వెల్లుల్లిలో సమృద్ధదిగా ఉంటాయి. రుతువులు మారే సమయంలో వచ్చే జలుబు, దగ్గు, కఫం నయం చేయడానికి వెల్లుల్లి రెబ్బలు ఉపయోగపడతాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం గొంతులో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. వెల్లుల్లిని నేరుగా తిన్నా, కొంచెం కాల్చి తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పరిశోధన ప్రకారం.. దీనిలోని క్రియాశీలక సమ్మేళనాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండెపోటులు, స్ట్రోకులు వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం నుంచి బయటపడవచ్చు. రోజుకు కనీసం నాలుగు వెల్లుల్లి రెబ్బలు పరగడుపుతో తినాలి.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అల్జీమర్స్, డిమెన్షియా వంటి మానసిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

వెల్లుల్లిలోని పోషకాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, క్యాన్సర్ నివారణలో సహాయపడతుందని ఓ అధ్యయనంలో బయటపడింది.





























