BECIL Recruitment 2022: ఇంటర్/డిగ్రీ అర్హతతో.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియాలో కన్సల్టెంట్ ఉద్యోగాలు.. రూ.2 లక్షల జీతం..
భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL).. కన్సల్టెంట్ పోస్టుల (Consultant Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
BECIL Consultant Recruitment 2022: భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL).. కన్సల్టెంట్ పోస్టుల (Consultant Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 19
పోస్టుల వివరాలు:
- సీనియర్ కన్సల్టెంట్ (ప్రాజెక్ట్) పోస్టులు: 3
- సీనియర్ అడ్వైజర్స్/కన్సల్టెంట్ (ఏవియేషన్) పోస్టులు: 3
- అడ్వైజర్స్/కన్సల్టెంట్ (MIS) పోస్టులు: 2
- కన్సల్టెంట్ (ఫైనాన్స్) పోస్టులు: 3
- కన్సల్టెంట్ (ఇంజనీరింగ్ సర్వీసెస్) పోస్టులు: 1
- జూనియర్ ఎగ్జిక్యూటివ్/ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు: 2
- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 2
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 3
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకుని ఈ మెయిల్ చెయ్యాలి.
ఈ మెయిల్ ఐడీ: project.mmp@becil.com
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.750
- ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్‌అభ్యర్ధులకు: రూ.450
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 14, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.