Cold Drinks Side Effects: కూల్ డ్రింక్స్‌ తాగుతున్నారా? ఐతే త్వరలోనే మీ జ్ఞాపకశక్తి హుష్‌!

కోల్డ్‌ డ్రింక్స్ (శీతల పానియాలు)లను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. పార్టీ ఏదైనా, సినిమాకి వెళ్లినా అక్కడ శీతల పానీయం లేకుండా ఉండదు. నేటి కాలంలో కోల్డ్‌ డ్రింక్స్ తాగే ట్రెండ్ తెగ పెరుగుతోంది. దీన్ని తాగితే..

Cold Drinks Side Effects: కూల్ డ్రింక్స్‌ తాగుతున్నారా? ఐతే త్వరలోనే మీ జ్ఞాపకశక్తి హుష్‌!
Cold Drinks
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 13, 2022 | 5:46 PM

Side Effects of Cold Drinks : కోల్డ్‌ డ్రింక్స్ (శీతల పానియాలు)లను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. పార్టీ ఏదైనా, సినిమాకి వెళ్లినా అక్కడ శీతల పానీయం లేకుండా ఉండదు. నేటి కాలంలో కోల్డ్‌ డ్రింక్స్ తాగే ట్రెండ్ తెగ పెరుగుతోంది. దీన్ని తాగితే వచ్చే అనుభూతి కంటే.. దీని వల్ల కలిగే చెడు ప్రభావాలు చాలా ఎక్కువ . శీతల పానీయాలు తాగే అలవాటున్న వారిలో అధిక శాతం షుగర్‌ (మధుమేహం), స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్‌, దంతాల సమస్యలు వంటి అనేక వ్యాధుల భారీన పడుతుంటారు. అదేవిధంగా కోల్డ్‌ డ్రింక్స్ తాగడం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతారని తెలుసా? అందుకే ఆరోగ్య నిపుణులు ఈ హానికరమైన శీతల పానీయాలకు దూరంగా ఉండాలని తరచూ చెబుతుంటారు. శీతల పానీయాల వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం..

మధుమేహం శీతల పానీయాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే శీతల పానీయాలు తగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీంతో శరీరంలో ఇన్సులిన్ పరిమాణం అమాంతంగా పెరుగుతుంది. ఇన్సులిన్ హార్మోన్ ఈ విధంగా నిరంతరం మార్పులకు గురైతే ఆరోగ్యానికి మరింత హానికరం.

ఊబకాయం ఫ్రక్టోజ్‌తో తయారుచేసే శీతల పానీయాల్లో సుక్రోజ్ కూడా ఉంటుంది. గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ అన్నీ చక్కెరకు సంబంధించినవే. ఫ్రక్టోజ్ శరీరంలో కేలరీలను పెంచుతుంది. అందువల్ల వీటిని తాగితే వేగంగా బరువు పెరగి ఊబకాయానికి దారి తీస్తుంది. రోజూ శీతల పానీయాలు తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం 60 శాతం పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

ఇవి కూడా చదవండి

కాలేయం దెబ్బతినే ప్రమాదం శీతల పానీయాల్లోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లను జీర్ణం చేయడానికి కాలేయం చాలా కష్టపడవల్సి ఉంటుంది. ఇవి కాలేయ వాపుకు దారితీసి, దాని ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి.

దంతక్షయం శీతల పానీయాలు లేదా సోడాలలో చక్కెర వంటి ఫాస్పోరిక్ ఆమ్లం, సేంద్రీయ ఆమ్లాలుంటాయి. ఇవి దంతాలపై రక్షణ కవచంగా ఉండే ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా దంతాలు పెళుసుగా మారడం లేదా పుచ్చిపోవడం జరుగుతుంది. పెళుసుగా ఉండే దంతాలు త్వరగా ఊడిపోతాయి.

జ్ఞాపకశక్తి దూరం.. శీతల పానీయాల్లో కెఫీన్ అనే మత్తు పదార్ధం కూడా ఉంటుంది. ఓ అధ్యయనం ప్రకారం.. శీతల పానీయాలు తాగిన తర్వాత కేవలం 5-10 నిమిషాల్లో శరీరంలో డోపమైన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ హార్మోను మిమ్మల్నిశీతల పానీయాలు ఎక్కువగా తాగాలని ప్రేరేపిస్తుంది. ఈ విధమైన కోల్డ్‌ డ్రింక్స్‌ వల్ల చిన్నపిల్లల్లో పెరుగుదల సమస్యలు వస్తాయి. జ్ఞాపకశక్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపి, ఏకాగ్రత కోల్పోయేలా చేస్తాయి.