Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఉల్లి పొట్టును పడేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

ఉల్లి చేసే మేలు..తల్లి కూడా చేయదు అని ఉల్లిలో (Onion) ఉన్న పోషకాల గురించి వివరిస్తూ పెద్దలు ఓ సామెతను చెబుతూ ఉంటారు. నిజమే.. ఉల్లిపాయ చేసే మేలు తెలిస్తే వామ్మో అనుకుంటారు. ఎందుకంటే ఉల్లిలోనే కాదు ఉల్లి పొట్టులోనూ ఎన్నో...

Health Tips: ఉల్లి పొట్టును పడేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
Onion Peel
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 13, 2022 | 5:52 PM

ఉల్లి చేసే మేలు..తల్లి కూడా చేయదు అని ఉల్లిలో (Onion) ఉన్న పోషకాల గురించి వివరిస్తూ పెద్దలు ఓ సామెతను చెబుతూ ఉంటారు. నిజమే.. ఉల్లిపాయ చేసే మేలు తెలిస్తే వామ్మో అనుకుంటారు. ఎందుకంటే ఉల్లిలోనే కాదు ఉల్లి పొట్టులోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి మరి. ఉల్లిపాయను కోసేటప్పుడు పొట్టు తీసేస్తూ ఉంటాం. కానీ వాటిలోనే విటమిన్ ఎ, సీ, ఈ, వంటివి ఎన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లి పొట్టులో (Onion Peel) యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. గుండె ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఉల్లిపాయ అద్భుతంగా పని చేస్తుంది. ఉల్లిలో ఉండే ఫోలేట్‌ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. ఉల్లిపొట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు.. కండరాల నొప్పులను తగ్గిస్తాయి. ఉల్లి పొట్టుతో చేసిన టీ తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలసటగా అనిపిస్తున్న సమయంలో ఉల్లిపాయ పొట్టును నీటిలో 10-20 నిమిషాలు మరిగించి, ఆ తర్వాత వడగట్టి తాగితే మంచి ఫలితాలుంటాయని సూచిస్తున్నారు.

ఉల్లి పొట్టు పాదం, చర్మంపై వచ్చే దురదను తగ్గిస్తుంది. ఉల్లిపాయ తొక్కలలో విటమిన్ సీ, ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లిపాయ పొట్టు టీ తయారు చేసేందుకు.. ముందుగా కడిగి పెట్టుకున్న ఉల్లి పొట్టను నీటిలో వేసి మరిగించాలి. నీరు రంగు మారాక..వడగట్టుకోవాలి. తీపి కోసం తేనెను కలుపుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.