Viral: అపార్ట్‌మెంట్‌ లోనుంచి ఘాటైన వాసన.. అనుమానంతో తలుపులు పగలగొట్టి చూడగా..

ఓ అపార్ట్‌మెంట్ నుంచి వస్తోన్న ఘాటైన వాసన స్థానికులను భయందోళనలకు గురి చేసింది. అసలే అర్ధరాత్రి కావడంతో అనుమానమొచ్చిన..

Viral: అపార్ట్‌మెంట్‌ లోనుంచి ఘాటైన వాసన.. అనుమానంతో తలుపులు పగలగొట్టి చూడగా..
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 13, 2022 | 1:46 PM

ఓ అపార్ట్‌మెంట్ నుంచి వస్తోన్న ఘాటైన వాసన స్థానికులను భయందోళనలకు గురి చేసింది. అసలే అర్ధరాత్రి కావడంతో అనుమానమొచ్చిన స్థానికులకు ఆ వాసన ఎటు నుంచి వస్తోందా అని చూశారు.! తమ అపార్ట్‌మెంట్ థర్డ్ ఫ్లోర్‌లో ఉన్న ఫ్లాట్ నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ ఫ్లాట్ తలుపులు పగలగొట్టి చూడగా.. అక్కడ కనిపించిన షాకింగ్ సన్నివేశాన్ని చూసి అందరూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ గామా-1‌లోని ఓ అపార్ట్‌మెంట్‌‌లో 21 ఏళ్ల పూజా భర్తీ అనే యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అపార్ట్‌మెంట్ వాసులు మూడో అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్ నుంచి అర్ధరాత్రి వేళ దుర్వాసన వస్తుండగా.. ఆ ఇంటి తలుపులను బద్దలు కొట్టి చూశారు. అక్కడ ఓ గోనె సంచిలో పూజా మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో వారికి దర్శనమిచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారి హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్నారు.

కొద్ది నెలలుగా పూజా ఆ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది. బీహార్‌కు చెందిన ఆమె గవర్నమెంట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. అంతేకాకుండా సదరు యువతితో పాటు ఆమె బంధువు రంజన్ అనే వ్యక్తి కూడా ఫ్లాట్‌లో కలిసి ఉండేవాడని అపార్ట్‌మెంట్ వాసులు చెప్పారు. స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు కాలేజీలో రంజన్ ఇంజినీరింగ్ చదువుతున్నాడని.. అతడికి పూజా మేనత్త వరుస అవుతుందని అక్కడున్న వారు పోలీసులకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నోయిడా పోలీసులు.. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పూజా మరణించి నాలుగైదు రోజులు అయిండొచ్చునని భావిస్తున్నారు. పూజా, రంజన్ మధ్య ఉన్న సంబంధం గురించి.. వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం రంజన్ పరారీలో ఉండగా.. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు స్థానికంగా ఉండే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే