Telangana Rains: 11మంది కూలీలతో వాగు దాటుతున్న జీపు.. ఒక్కసారిగా ముంచేసిన వరద ఉధృతి..!

కుంటాల మండలంలోని ఓల -మెదన్ పూర్ గ్రామాల మధ్య వాగు ఉదృతం గా ప్రవహిస్తుంది. వాగును దాటుతుండగా కూలీలతో ప్రయాణిస్తున్న జీపు

Telangana Rains: 11మంది కూలీలతో వాగు దాటుతున్న జీపు.. ఒక్కసారిగా ముంచేసిన వరద ఉధృతి..!
Jeep Crosses
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 13, 2022 | 2:10 PM

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈక్రమంలోనే నిర్మల్‌ జిల్లాలో ప్రాంతాలకు వెళ్లే రహదారులు కొట్టుకుపోయి, ప్రజలు అవస్థలు పడుతున్నారు. కుంటాల మండలంలోని ఓల -మెదన్ పూర్ గ్రామాల మధ్య వాగు ఉదృతం గా ప్రవహిస్తుంది. వాగును దాటుతుండగా కూలీలతో ప్రయాణిస్తున్న జీపు ఒకటి కొట్టుకుపోయింది. అది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటినా వాగులోకి దిగి కూలీలను సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. జీపులో 11 మంది కూలీలు ఉన్నారు. వారంతా మహారాష్ట్రకు చెందినవారిగా తెలిసింది. మెదన్ పూర్ గ్రామంలో కూలీ కి వచ్చి మహారాష్ట్ర లోని హిమాయత్ నగర్ కు వెళ్తుండగా జరిగిన ఘటన.

ఇక ఆదిలాబాద్ జిల్లా అంతటా జోరు వానలు పడుతున్నాయి. జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీలోనూ వరద భీభత్సం సృష్టిస్తోంది. వరద ఉధృతికి శంభు మత్తడి గూడ ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. దీంతో వరద భారీగా దిగువ ప్రాంతాల్లోకి చేరుతోంది. ఈ క్రమంలో దిగువన ఉన్న లక్కారం, గంగన్నపేటలకు వరద ముప్పు పొంచి ఉంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు… ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అటు, మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 43 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 8.50 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.7168 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అడవి పందుల నుంచి రక్షణ కోసం వల పెట్టారు.. అందులో చిక్కింది చూస్తే
అడవి పందుల నుంచి రక్షణ కోసం వల పెట్టారు.. అందులో చిక్కింది చూస్తే
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..